చిరంజీవికి లాగానే బాబుకు కనువిప్పు: లగడపాటి

చంద్రబాబు వేర్పాటువాదానికి మద్దతు పలికారు కాబట్టే విభజనకు మెజారిటీ శానససభ్యులు అనుకూలంగా ఉన్నారనే అపోహ బయలుదేరిందని, దాంతో విభజనపై చర్చ కేంద్ర స్థాయిలో ప్రారంభమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం శానససభ్యులు 90 మందితో పాటు తమ పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యులు, తెలంగాణకు అనుకూలంగా ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులు కలిస్తే 150 మందికిపైగా వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్న అభిప్రాయం కలుగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో శాసనసభలో అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గారని, అసెంబ్లీలో తీర్మానం పెడితే యాభై మందికి పైగా తెలుగుదేశం శానససభ్యులు వ్యతిరేకిస్తారని, అందుకే తాము అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని అడుగుతున్నామని ఆయన అన్నారు. తాము ఒత్తిడి తెచ్చి చంద్రబాబు మనసు మార్చి సమైక్యవాదానికి అనుకూలంగానో, మధ్యమార్గానికి వచ్చే విధంగానో మారుస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాకు వెళ్లి మనసు మార్చే పనిచేస్తామని, విభజన వల్ల జరిగే అనర్థాలను వివరించి చంద్రబాబుకు కనువిప్పు కలిగిస్తామని ఆయన అన్నారు.
వేర్పాటువాదుల్లాగా తాము దౌర్జన్యాలు చేయడం లేదని, తాము ప్రశాంతంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. వేర్పాటువాదులది హింసాత్మక ఆందోళన అని, తమది సైలెంట్ ఉద్యమమని ఆయన అన్నారు. చంద్రబాబుకు రెడ్ కార్పెట్ పరిచి, స్వాగతం చెప్పి ఒత్తిడి చేస్తామని ఆయన అన్నారు. తెలుగు తల్లి ముక్కలయ్యే అవకాశం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన తర్వాత జరిగిన అఖిల పక్ష సమావేశంలో పార్టీలు తలో వైఖరి చెప్పారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు ఏకాభిప్రాయం లేదని ఆయన అన్నారు.
తమ పార్టీకి చెందిన మెజారిటీ శానససభ్యులు గురువారం హైదరాబాదులో సమావేశమై విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెసులో రెండు అభిప్రాయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మనసు మారే వరకు చంద్రబాబును తాను కలుస్తూనే ఉంటానని లగడపాటి చెప్పారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రకటనను తాము కేంద్రం నుంచి చేయిస్తామని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడే విధంగా చంద్రబాబు మనసు మారుస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications