హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటేశారని ప్రణబ్‌కి, మతమని సోనియాకు: జగన్‌పై గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికలలో తనకు ఓటేశారనే సానుభూతి ప్రణబ్ ముఖర్జీకి ఉందేమోనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు, ఆ పార్టీ ఇతర నేతలకు రాష్ట్రపతి ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీని కలిసేందుకు అనుమతించడం శోచనీయమన్నారు. జగన్ తనకు అనుకూలంగా ఓటేశారనే సానుభూతి ఉందేమో అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా జగన్ తన మతానికి చెందిన వాడనే సానుభూతి ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్ జగన్ బెయిల్ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంత తొందరెందుకన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండు కలిసి తెలుగుదేశం పార్టీపై కుట్ర పన్నుతున్నాయన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపును రద్దు చేయాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. జగన్ పార్టీ నేతలు రాష్ట్రపతిని భయపెట్టేలా ప్రవర్తించారని విమర్శించారు. అవినీతి మంత్రులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇటలీ రాణా సోనియా గాంధీ భారత దేశ సంపదను దోచుకుంటుందని ఆరోపించారు. సోనియా భారత్ సొమ్మును విదేశాలకు తరలిస్తున్నార్ననారు. అవినీతిపరుల కోసం, జైలులో ఉన్న బందిపోట్ల కోసం సంతకాలు సేకరించడం దారుణమన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యక్తం చేశామన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్రమే అని గాలి అన్నారు.

English summary
Telugudesam Party leader Gali Muddukrishnama Naidu suspected that Pranab Mukherjee and Sonia Gandhi are sympathised at YSR Congress party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X