విడదీస్తే తీవ్ర పరిణామాలు: మధ్యలో వెళ్లిన నేతలు

తీర్మానం కాపీని కేంద్రానికి, అధిష్టానానికి పంపించాలని నేతలు సమావేశంలో నిర్ణయించారు. ఇందిరాగాంధీ స్ఫూర్తిని కొనసాగించాలని భేటీలో నిర్ణయించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే రాజీనామాకు సిద్ధమని అధిష్టానానికి తేల్చి చెప్పాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందు తమను సంప్రదించాలని వారు కేంద్రాన్ని కోరనున్నారు. ఈ నెల 21 ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
25న రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించే సభకు వెళ్లాలని నిర్ణయించారు. బుధవారం మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిల వ్యాఖ్యలు సమావేశంలో చర్చించారు. అధిష్టానం తమను మాట్లాడనివ్వలేదని, అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాయని టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు.
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్థసారథి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, మస్తాన్ వలీ, ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి తీసుకు వస్తుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. ఢిల్లీ పరిణామాలు ఇచ్చేట్లుగా ఉన్నాయన్నారు. ఆయనకు ఇతర నేతలు సర్ధి చెప్పారు. సమష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని వట్టి వసంత్ కుమార్, శైలజానాథ్, పార్థసారథి అన్నారు. కాగా సమావేశం మధ్యలో డిఎల్ రవీంద్రా రెడ్డి, మహీధర్ రెడ్డి, పార్థసారథిలు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications