దానం కాన్వాయ్‌పై దాడి: వెంటాడి పట్టుకున్నవైనం

దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. ఈ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దానం తన ఆడి కారులో వెళుతుండగా ఈ దాడి జరిగింది. తన కాన్వాయ్ పైన దాడి చేయడంతో దానం ముఖం వెంటనే కందిపోయింది. దాడిని తీవ్రంగా ఖండించారు. తాను వెళుతుండగా, అడ్డుకొని దాడి చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అన్నారు.
స్వతంత్ర భారతంలో ఎవరి అభిప్రాయాలు చెప్పుకునే హక్కు వారికి లేదా అని ప్రశ్నించారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తాను నగర ప్రజల అభిప్రాయాన్ని చెప్పానన్నారు. బుధవారం దానం నాగేందర్ సహచర మంత్రి ముఖేష్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. విభజించే పరిస్థితి వస్తే హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆగ్రహించిన జెఏసి నేతలు ఈ రోజు దాడి చేశారు. అయితే దాడి చేసిన వారిలో కెయు జెఏసితో పాటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ఉన్నారు.
దానంపై ఫిర్యాదు
మంత్రి దానం నాగేందర్ అకారణంగా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానం తనపై అకారణంగా దాడి చేశారని నాంపల్లి కోర్టు క్రిమినల్ లాయరు తిరుపతి వర్మ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తను గోల్కొండ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో భారీగా కార్యకర్తలు ఆసుపత్రికి తరలి వస్తున్నారు.
విశ్వరూప్ ఇంటి ముట్టడి
ఎస్ఆర్ నగర్‌లోని మంత్రి విశ్వరూప్ ఇంటిని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ముట్టడించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా సీమాంధ్ర నేతల సమావేశాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications