తెలంగాణ: తగ్గిన మల్లాది విష్ణు, ఓట్ల కోసమే: వీరశివా

Veera Siva Reddy - Malladi Vishnu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై నిన్నటి వరకు ఘాటుగా మాట్లాడిన కృష్ణా జిల్లా అధికార పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గురువారం తన గొంతు తగ్గించినట్లుగా కనిపిస్తోంది. తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, మేం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం అనుకోవడం అపోహే అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే.. తమ ప్రాంత ప్రజల మనోభావాలు చెప్పేందుకే సమైక్యాంధ్ర భేటీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.

తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న సంకేతాలు తమకు లేవన్నారు. గతంలో పలుమార్లు ఇది సున్నితమైన అంశమని అధిష్టానం చెప్పిందని, అలాంటప్పుడు విభజిస్తుందని తాము భావించడం లేదన్నారు. అయితే పరిష్కారం దిశగా ఆలోచిస్తుందని మాత్రం తెలుసునన్నారు. సమైక్యాంధ్ర కార్యాచరణ కోసం తాము భేటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే రాజీనామాలు చేసే ఆలోచన తామెవరం చేయలేదన్నారు. రాజీనామాలు చేస్తామని కొందరు చెప్పినప్పటికీ అది వారి వ్యక్తిగతమన్నారు. హైదరాబాదులో సమావేశం నిర్వహించికునే హక్కు తమకుందన్నారు. హైదరాబాద్ అందరికీ చెందిందన్నారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, అలాగే తాము ప్రజల మనోభావాలు కూడా గౌరవిస్తామన్నారు. అలాగే మా ప్రాంత ప్రజల మనోభావాలు కూడా చెప్పుకుంటామన్నారు.

విభజిస్తే శాస్త్రీయంగా...

రాష్ట్రాన్ని విభజించాల్సిన పరిస్థితి వస్తే శాస్త్రీయంగా అది జరగని కమలాపురం ఎమ్మెల్యే వీరశివ రెడ్డి అన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన రాజకీయాలు అని ఆయన ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+