బాబుతో ఎలాంటి విభేదాల్లేవు: అలకవీడిన మోత్కుపల్లి

Mothkupalli Narasimhulu
ఖమ్మం/నల్గొండ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తుంగతుర్తి శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తన అలకను వీడారు. కొద్ది రోజులుగా మోత్కుపల్లి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అలక వహించిన విషయం తెలిసిందే. అయితే అలక వీడిన ఆయన గురువారం ఉదయం చంద్రబాబును కలుసుకున్నారు. బాబు పాదయాత్ర ఈరోజు నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. బాబు పాదయాత్రలో మోత్కుపల్లి పాల్గొనే అంశంపై సందిగ్ధత ఏర్పడింది.

అయితే పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే మోత్కుపల్లి అధ్యక్షుడిని కలుసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఆయన అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు. కాగా బాబు పాదయాత్ర ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది.

బాబుకు వేలాదిగా కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్ వద్ద బాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు సిపిఐ, యుటిఎఫ్, ఎమ్మార్పీఎస్ కూడా బాబుకు ఘన స్వాగతం పలికాయి.

బాబును కలిసిన వారిలో మోత్కుపల్లితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరీలు కూడా ఉన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాలో తొమ్మిది రోజుల పాటు మూడు నియోజకవర్గాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+