పాశ్చాత్య ప్రభావం వల్లే రేప్‌లు: పూరి శంకరాచార్య

దీన్ని మార్చాల్సిన అవసరం లేదని, స్వాతంత్ర్యానికి పూర్వం మన సంస్కృతిని, విలువలను కాపాడుకోగలిగామని, స్వాతంత్ర్యానంతరం గత 65 ఏళ్ల చాలా వరకు అవి ధ్వంసమయ్యాయని ఆయన అన్నారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ వంటి కిరాతక సంఘటనలు అకస్మాత్తుగా జరగవని, నాగరికత, అభివృద్ధి పేరు మీద సంస్కృతికి, విలువలకు సంబంధించిన దళసరి పొర చిరిగిపోయినప్పుడే అటువంటి సంఘటనలు జరుగుతాయని ఆయన అన్నారు.
గతంలో అన్నా చెల్లెళ్లు స్వేచ్ఛగా కలిసి తిరిగేవారని, అయినా ఏమీ జరిగేది కాదని, మానవ విలువలు, ఉద్వేగాలు తగ్గిపోయాయని, మహిళను గౌరవించాలని మన నాగరికత, సంస్కృతి చెబుతాయని, మహిళలు మనకు మాతృమూర్తులూ, అక్కాచెల్లెళ్లు అని అన్నారు.
భారత సైనికులను ఇద్దరిని పాకిస్తాన్ సైనికులు కాల్చి చంపడం కిరాతకమని, మానవ విలువలకు విరుద్ధమైందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. అటువంటి సంఘటనలను ఎదుర్కోవడంలో తగిన సమర్థతను ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications