హక్కంటే ఖబర్దార్: నగరంపై లగడపాటికి హరీష్ సవాల్

Hairsh Rao
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాదు వచ్చి కార్పోరేటర్‌గా గెలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు శనివారం సవాల్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి నుండి ఏ స్థాయిలో పోటీ చేసినా గెలుస్తారన్నారు. లగడపాటి కార్పోరేటర్‌గా గెలవగలరా అన్నారు. తెలంగాణ ఏర్పడితే రెండు ప్రాంతాలు బాగుపడతాయన్నారు. లగడపాటి అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు.

తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని, అక్కడి ప్రజల రక్తమాంసాలు, చెమట, శ్రమతో ఆ పట్టణం నిర్మితమైందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌ కుమార్ వేరుగా అన్నారు. హైదరాబాద్ పైన యాజమాన్య హక్కు అంటే ఖబర్దార్ అని హెచ్చరించారు.
తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేయకముందే, హైదరాబాద్ పట్టణం దేశ రెండో రాజధాని హోదా కల్పించే స్థాయిలో ఉందని మాత్రమే అంబేద్కర్ అన్నారని, దానికి టిడిపి వక్రభాష్యం చెప్పటం సరికాదన్నారు.

ఇక్కడ స్థిరపడే వారు కిరాయిదారులు అవుతారేగాని, హక్కుదారులు కాదంటూ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమనే ప్రచారం జరుగుతున్న క్రమంలో టిడిపి నేత సుధీష్ రాంబొట్ల హైదరాబాద్‌పై కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసిన సుధీష్ రాంబొట్ల 10 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. చివరికి లక్ష ఓట్లు కూడా సంపాదించలేకపోయారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+