• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రానిదే: జగన్‌తో పొత్తుపై వాయలార్, తెలంగాణపై నో

By Srinivas
|
Vayalar Ravi
జైపూర్: వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు అంశంపై కేంద్రమంత్రి వాయలార్ రవి శనివారం కొట్టి పారేయకుండా ఆ బాధ్యతను రాష్ట్ర కాంగ్రెసు పైకి నెట్టేశారు. ఎన్నికల నాటికి అవసరాన్ని బట్టి కొత్త మిత్రులను వెతుక్కుని, పొత్తులు పెట్టుకుంటామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవి పరోక్షంగా చెప్పారు. జైపూర్‌లో జరుగుతున్న చింతన్ బైఠక్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీతో జతకట్టడంపై రాష్ట్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

మేధో మథనంలో కొత్త పొత్తులపై దృష్టి సారించాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జతకట్టే విషయంపై మాట్లాడుతూ... ఆ విషయం తనకు తెలియదని, జగన్ కొన్ని నెలల కిందటే కాంగ్రెస్‌ను వదిలి బయటకు వెళ్లారని, అందువల్ల, ఆయన పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అన్న విషయంపై ఆంధ్రప్రదేశ్ నాయకులే చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలన్నారు.

బార్కిస్ (ఛార్లెస్ డికెన్స్ నాటకంలో ఓ పాత్ర) పెళ్లికి సిద్ధం అంటే.. ఎవర్ని పడితే వారిని చేసుకోవడానికి సిద్ధం కాదంటూ ఎవరితో పడితే వారితో పొత్తులు ఉండవని వ్యాఖ్యానించారు. అలాగే, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితిని బట్టి ఏదైనా జరుగుతుందన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ 1960 నుంచి పొత్తులు పెట్టుకుంటోందని, ఇప్పటికీ యుటిఎఫ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా అధికారాన్ని చేపట్టలేనప్పుడు రాజకీయ పరిస్థితిని బట్టి భావసారూప్యతగల పార్టీలను కలుపుకొని ముందుకెళ్లాలన్నది తమ సిద్ధాంతమన్నారు. ఉత్తర భారతంలో తమ ప్రత్యర్థి బిజెపి అని, దానిని ఓడించేందుకు తాము పొత్తులు పెట్టుకోక తప్పదని వయలార్ అన్నారు. దక్షిణాదిలో వివిధ ప్రాంతీయ పార్టీలు తమకు ప్రత్యర్థులుగా ఉన్నాయని, అది కూడా తాము పొత్తులు పెట్టుకునే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.

కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు చేజారుతోందని సోనియా ప్రస్తావించినందునే, మేధోమథనంలో ఆ అంశంపై చర్చిస్తున్నామన్నారు. కొత్త మిత్రులను వెతుక్కోవటం, పొత్తులు పెట్టుకోవటం, ఐక్య కూటమి ఆధ్వర్యంలో ఎన్నికను ఎదుర్కోవటం కాంగ్రెస్ పార్టీకి కష్టమేమీ కాదన్నారు. ఇది రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మారుతుందన్నారు. ప్రస్తుతానికి ఈ విధానం రాష్ట్రాలకే పరిమితమని, 2014 ఎన్నికల్లో కొత్త మిత్రులను వెదుక్కునే అంశం గురించి తర్వాత చర్చిస్తామన్నారు.

తెలంగాణపై శనివారం మధ్యాహ్నం వరకూ ఎలాంటి చర్చా జరగలేదన్నారు. చిన్న రాష్ట్రాలపై చర్చ జరుగుతుందా, లేదా అనే విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. అసలు ఇలాంటి చర్చ జరుగుతోందని ఎవరు చెప్పారని వాయలార్ రవి మీడియాను ఎదురు ప్రశ్నించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Union Minister Vayalar Ravi's comments on the 
 
 Congress preferring seat adjustments with regional 
 
 parties, created a flutter in the state with the YSRC 
 
 clarifying that it has no interntions to go in for 
 
 adjustments with the Congress, In reply to a question 
 
 Mr Ravi said It is up to the APCC to decide on tie 
 
 ups in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more