తెలంగాణ: దేవినేని ఉక్కిరిబిక్కిరి!, లగడపాటిపై నిప్పులు

తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టిబడి ఉన్నామని చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో ఇచ్చిన లేఖకే తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ ద్వంద వైఖరికి పాల్పడుతోందని మండిపడ్డారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిచ్చి మాటలు మానుకోవాలని సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను అడ్డుకుంటానని చెప్పడం లగడపాటికి సరికాదన్నారు.
బాబు యాత్రను అడ్డుకుంటామన్న లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించారు. కాగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర టిడిపి నేతలు ఏం చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందించేందుకు నిరాకరించారు. చంద్రబాబు నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు అందరూ అంగీకరిస్తున్నారా అనే దానిపై కూడా ఆయన మాట్లాడలేదు. అయితే కాంగ్రెసు పైన నిప్పులు చెరిగారు.
మాకు నష్టం లేదు
పార్టీ నుండి కొందరు వెళ్లిపోతే తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి వర్గాల మధ్య ఉన్న విభేదాలు అంత తీవ్రమైనవేమీ కాదన్నారు. అవి సమసిపోతాయన్నారు. వాయలార్ వ్యాఖ్యలతో కాంగ్రెసుతో జగన్‌కు అంతర్గత సంబంధాలున్నాయని అర్థమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications