'నాయక్'లో పేరు వివాదం: బాబ్జీకి వివి వినాయక్ సారీ

VV Vinayak
విశాఖపట్నం: విశాఖ జిల్లా మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీకి నాయక్ చిత్రం దర్శకుడు వివి వినాయక్ ఆదివారం క్షమాపణలు చెప్పారు. గండి బాబ్జీతో తనకు ఇది వరకు ఎలాంటి పరిచయం లేదని, అతనిని కించపర్చాలని చిత్రంలో ఆయన పేరు పెట్టలేదని, ఆయనతో టచ్ కూడా లేదని, ప్రతి నాయకుడి పాత్రధారికి కాకతాళీయంగానే ఆ పేరు పెట్టామని, ఇందుకు ఆయన బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని దర్శకుడు వివి వినాయక్ అన్నారు.

రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రం విజయోత్సవ యాత్రను చిత్ర యూనిట్ చేపట్టింది. విశాఖపట్నంలోని వీమాక్స్‌లో రామ్ చరణ్ తేజ, వివి వినాయక్ తదితరులు ప్రేక్షకులతో చిత్రం విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి క్షమాపణలు చెప్పారు.

కాగా నాయక్ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రధారికి తన పేరును పోలిన పేరు పెట్టడంపై బాబ్జీ మండిపడ్డారు. ఆయన ఆందోళన కూడా చేశారు. గండికోట బాబ్జీలో ఉన్న ఇంటి పేరును చిత్రంలో తొలగించారు. ఆ తర్వాత కూడా బాబ్జీ ఇంటి పేరును మాత్రమే తొలగించి బాబ్జీ అనేది అలాగే ఉంచారని, దానిపై తాను అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో విలన్ అన్యాయం, అక్రమాలు, భూకబ్జాలు చేయడం సినియే కావచ్చు.

కానీ తన పేరు పేరుతో ఉండడం చాలా అవమానంగా ఉందని అప్పుడు బాబ్జీ అన్నారు. చిత్రం విడుదలైన రోజే తాను ఈ విషయాన్ని దర్శకులు వివి వినాయక్ దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. దానిపై స్పందించిన ఆయన పేరును తొలగిస్తానని చెప్పారని కానీ, కేవలం ఇంటి పేరును మాత్రమే తొలగించారని, బాబ్జీ అనే దానిని అలాగే ఉంచారన్నారు. చిత్రం విడుదలయి వారం రోజులు గడుస్తున్నా తన పేరును పూర్తిగా తొలగించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+