నాది రాజీనామానే.. మీరు: జెసితో కోమటిరెడ్డి ఆసక్తికరం

అదే సమయంలో ఆయన మీరు మచ్చలేని మనిషి అని, మీరు కూడా రాజీనామా చేయవచ్చు కదా అని జెసితో కోమటిరెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. దానికి జెసి స్పందిస్తూ.. నిర్ణయం వచ్చాక తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. సమైక్యం కోసమని రాజీనామా చేస్తే అది విజయవాడ, గుంటూరు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావుల కోటాలోకి వెళుతుందని కోమటిరెడ్డి అన్నారు.
అందుకు జేసి తన నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వడం లేదని అందుకోసం తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ... కేంద్రమంత్రి వాయలార్ రవి వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తుందని అన్నారు. సమానస్థాయిలో ఉన్న పార్టీలతో పొత్తు అయితేనే బాగుంటుందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయమై వాయలార్ రవి చేసిన వ్యాఖ్యలను చూసి నవ్వాలనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications