షిండేతో సీమాంధ్ర భేటీ: 25న్నే తెలంగాణపై నిర్ణయం?

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర నాయకులు సోమవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు టిజి వెంకటేష్, ఎరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్, పార్థసారథి, పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, జెడి శీలంలతో పాటు 40 మంది నాయకులు షిండేను కలిశారు. తెలంగాణపై ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని షిండే తమకు చెప్పినట్లు టిజి వెంకటేష్ భేటీ అనంతరం చెప్పారు. తెలంగాణపై నిర్ణయం అనుకూలమని గానీ వ్యతిరేకమని గానీ షిండే చెప్పలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపై తాము షిండే ఆలోచనను పట్టుకోలేకపోయామని ఆయన అన్నారు. తమ వాదనలను సుశీల్ కుమార్ షిండే సానుకూలంగా విన్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుందనేది మీడియా సృష్టించిన ఊహాగానాలేనని సీమాంధ్ర నేతలు అన్నారు. అన్ని ప్రాంతాల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని షిండే చెప్పినట్లు వారు తెలిపారు. షిండేతో సీమాంధ్ర నేతలు దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు.

విభజన వల్ల హైదరాబాదు సమస్య, నీటి పంపకాల సమస్య తలెత్తుతాయని వారు సుశీల్ కుమార్ షిండే చెప్పారు. వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు ఇవ్వాలని వారు కోరారు. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న మీకు రాష్ట్ర పరిస్థితులు తెలుసు కాబట్టి సమైక్య రాష్ట్రాన్ని కాపాడుతూ నిర్ణయం తీసుకోవాలని వారు షిండేను కోరారు. రాష్ట్ర పరిస్థితులు తమకు తెలుసునని, అన్నీ పరిశీలిస్తామని షిండే సీమాంధ్ర నేతలతో చెప్పారు. సుశీల్ కుమార్ షిండేను కలిసిన తర్వాత సీమాంధ్ర నేతలు ఆనందంగా కనిపించారు. వారి ముఖాల్లో నవ్వు స్పష్టంగా కనిపించింది.

ఇదిలావుంటే, ఈ నెల 28వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 28 తేదీ ఉదయం సుశీల్ కుమార్ షిండే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. దాంతో ఆయన బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరడానికి ముందే తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+