బావను కల్సిన బావమరిది: రిజైన్లకు ఎమ్మెల్యేల గడువు

Nandamuri Harikrishna - Chandrababu Naidu
నల్గొండ/విజయవాడ: వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సోమవారం ఉదయం కలిశారు. బాబు తీరుపై హరికృష్ణ గతంలో పలుమార్లు పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హరికృష్ణ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని చెప్పారు.

పలుమార్లు బావ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హరికృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుండి ప్రారంభమైన వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభం అంతా తానై చూసుకున్నారు. బాబు యాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందు అక్కడకు వెళ్లి అన్ని సిద్ధం చేశారు. యాత్ర ప్రారంభించినప్పుడు బాబుతో పాటు కొద్ది దూరం నడిచారు. మళ్లీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో నల్గొండ జిల్లా రామాపురం వద్ద కలిశారు. బాబు రాత్రి అక్కడే బస చేశారు.

బాబును కలిసిన అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో వారే ఆలోచించాలన్నారు. బాబు యాత్ర యధావిధిగా కొనసాగుతుందన్నారు.

పాదయాత్రకు మంచి ఆదరణ వస్తుందని చంద్రబాబు అనంతరం చెప్పారు. ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. యాత్రను కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు. సహకార ఎన్నికల్లో సత్తా చూపాలన్నారు.

పయ్యావుల, పల్లె ఇంటి ముట్టడి

సమైక్యాంధ్ర జెఏసి నేతలు ఆదివారం తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, సోమవారం ఉదయం పల్లె రఘునాథ్ రెడ్డి ఇళ్లను ముట్టడించారు. ఆదివారం గుర్నాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించిన అనంతరం వారు పయ్యావుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. తాను పార్టీ అధిష్టానంతో మాట్లాడతానని, సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. రాజీనామాపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

సోమవారం ఉదయం పల్లె రఘునాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. సమైక్యం కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజనపై వెంటనే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని ఆయనల డిమాండ్ చేశారు. తీర్మానం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రెండు రోజుల్లో రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+