మజ్లిస్ బంద్: దుకాణాలపై రాళ్లదాడి, పాషాఖాద్రీపై కేసు!

పలుచోట్ల చెదురుముదురు సంఘటనలు జరిగాయి. అంబరుపేటలో మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దుకాణాల పైన రాళ్లు రువ్వారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. లక్డీకాపూల్‌లో ఓ ఆర్టీసి బస్సు పైన మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. రామాంతపూర్‌లోని వెంకటరెడ్డినగర్‌లోనూ ఆర్టీసి బస్సు అద్దాలు పగులగొట్టారు. పాతబస్తీ పత్తర్ గట్టి వద్ద మీడియాపై దాడి చేశారు.
పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. మురళీ నగర్, మెహిదీపట్నం, హుమాయున్ నగర్ తదితర ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. దుకాణాలను బలవంతంగా మూసివేయిస్తున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
చిన్న చిన్న సంఘటనలు మినహా పరిస్థితి ప్రశాంతంగా ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. నగరంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవన్నారు. ఎలాంటి ఘటనలను అయినా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
పాషాఖాద్రీపై కేసు నమోదు
అసెంబ్లీ, ఎర్రకోట, చార్మినార్ తదితర చారిత్రక కట్టడాలు తమవే అన్న మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ పైన కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications