రాత్రికి రాత్రే..: లగడపాటి అరెస్ట్‌కు యత్నం, జోగి అరెస్ట్

Lagadapati Rajagopal - Jogi Ramesh
విజయవాడ: కాంగ్రెసు పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా కలిసేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బాబును కలిసేందుకు లగడపాటి అనుమంచిపల్లి రాత్రికి రాత్రే చేరుకున్నారు. దీంతో సోమవారం ఉదయానికి లగడపాటి ఉన్న ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

అనుమంచిపల్లిలో లగడపాటి ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. పలువురు లగడపాటి కార్యకర్తలను అరెస్టు చేశారు. లగడపాటిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఉన్న ఇంటి తలుపులను బద్దలు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. లగడపాటి ఉన్న ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. బాబు పూటకో మాటలాడుతున్నారని, తనయుడు లోకేష్ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా చంద్రబాబుకు పూలతో ఘన స్వాగతం పలుకుతామని, కనువిప్పు కార్యక్రమాలు చేపడతామన్న లగడపాటి రాజగోపాల్ వ్యూహాత్మకంగా రాత్రికి రాత్రే అనుమంచిపల్లికి వెళ్లారు. అతను అందరి కళ్లు గప్పి ఆదివారం అర్ధరాత్రికి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి చేరుకున్నారు. రాత్రి 9.30 వరకు విజయవాడలోని తన ఇంట్లోనే ఉన్న లగడపాటి ఉన్నట్టుండి ఒంటరిగా బయల్దేరి ఆ గ్రామానికి వెళ్లిపోయారు. వాస్తవానికి రెండు, మూడు వేలమందితో వెళ్లి చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం.

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అరెస్టు

చంద్రబాబును కృష్ణా జిల్లాలో అడ్డుకునేందుకు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు నాలుగు గ్రూపులుగా విడిపోయి బాబును అడ్డుకోవాలని యోచిస్తున్నారు. బాబు యాత్రను అడ్డుకునేందుకు బయలుదేరిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్‌లను కూడా పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+