కెవ్వుకేక అంటే ఐటం సాంగ్: లగడపాటికి హరీష్ కౌంటర్

Harish Rao
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కెవ్వుకేక అనేలా చేస్తామన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మంగళవారం కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఉదయం హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్ అని, ఆయన వేషాలు అన్నీ అలాగే ఉంటాయన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కెవ్వు కేక అనిపిస్తానని ఆయన చెబుతున్నారని, అలా అనిపిస్తే అది ఐటం సాంగ్ అవుతుందని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఐటం సాంగ్ వంటిదన్నారు. లగడపాటి వంటి నేతలు హైదరాబాద్ తమది అని చెబుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలోని కొందరు వ్యక్తులు వ్యాపారాలు చేసుకోవాడనికి మాత్రమే ఇక్కడకు వచ్చారని, వ్యాపారం పేరుతో హైదరాబాదులో భూకబ్జాకు పాల్పడుతున్నారని విమర్శించారు.

హైదరాబాద్ తెలంగాణ సొత్తు అన్నారు. తెలంగాణ వచ్చాక కార్మికులకు పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. ఈ ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. అందుకే తెలంగాణ కార్మికుల సమస్యలు పట్టడం లేదన్నారు. తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్రం ఈ నెల 28వ తేదీలోగా హైదరాబాదుతో కూడిన తెలంగాణను ప్రకటించాల్సిందే అన్నారు.

లేదంటే తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పినట్లుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇస్తే గౌరవంగా తీసుకొని అందర్నీ గౌరవిస్తామని లేదంటే వ్యతిరేక పార్టీలను పాతరేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+