తెలంగాణ అడగడం కాదు: 'నూటొక్క..' పుస్తకావిష్కరణ

తెలంగాణవాదుల నూటొక్క అబద్దాల పుస్తకంలోని అంశాలను తాను ఖండించడం కానీ ఆమోదించడం కానీ చేయడం లేదన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందన్నారు. ప్రతి ఒక్కరికి తమ తమ అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లవద్దని తనకు పలువురు సందేశాలు పంపారని, సూచనలు చేశారన్నారు. తనపై ఎంతగా ఒత్తిడి తెచ్చినప్పటికీ తాను పాల్గొన్నానని అన్నారు.
నూటొక్క అబద్దాల పుస్తకాన్ని అందరూ చదవాలని, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. పుస్తకాన్ని పూర్తిగా చదివి, వాస్తవ పరిస్థితులను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ అంశంపై ఓ మంచి నివేదిక ఇచ్చిందన్నారు. అయితే రహస్యం నివేదికను తప్పుగా రూపొందించారన్నారు. తెలంగాణ కోసం అరవయ్యేళ్లుగా పోరాటం జరుగుతోందన్నారు.
తెలంగాణ వెనుకబాటుతనం గురించి పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ సెక్టార్ అన్నారు. ముంబయికీ ధీటుగా అది అభివృద్ధి చెందుతోందన్నారు. ఐటి అభివృద్ధి కూడా బాగా ఉందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉందని, సెంటిమెంట్ వేరు రాజకీయం వేరన్నారు. అభివృద్ధికి విభజననే పరిష్కార మార్గం కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం గురించి కాకుండా అభివృద్ధి గురించి అడగాలని సూచించారు.












Click it and Unblock the Notifications