పిక్చర్స్: బరాక్ ఒబామా ప్రమాణం రోజు ఇలా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో తళుకులీనే చీరెలు, నెహ్రూ జాకెట్లు కనిపించాయి. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి పలువురు ఇండియన్ అమెరికన్లు ఆహూతుల జాబితాలో చోటు చేసుకున్నారు.

ఇండియన్ రాజకీయ పులి వచ్చేసిందని శ్వేతసౌధం సలహాదారు టాబీ చౌదరి అన్నారు. ఈ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త తన భార్య రూబీతో కలిసి నృత్యం చేశాడు. ఆయనతో పాటు మరి కొంత మంది ప్రముఖ ఇండియన్ అమెరికన్లు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇండియన్ అమెరికన్లు రాజకీయ, సామాజిక, పాలనా రంగాల్లో ప్రభావం చేసే రీతిలో ముందుకు వచ్చారు.

ఈ వేగాన్ని కాపాడుకోవడమే సవాల్ అని టోనీ చౌదరి పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. సమాజంలోని భిన్న వర్గాల నుంచి ఒబామా తన పాలనా వ్యవస్థలోకి వ్యక్తులను తీసుకున్నారని శ్వేత సౌధం న్యాయ శాఖ సీనియర్ అధికారి అరుణ్ రావు అన్నారు. చీరెలో ముస్తాబైన తన భార్య పక్కన నించుని అరుణ్ రావు మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పట్ల ఇండియన్ అమెరికన్ ప్రముఖ చెఫ్ కెఎన్ వినోద్ అన్నారు. గత నాలుగేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, ఇక పుంజుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఒబామా ఇండియా వంటకాలను ఇష్టపడతారని చెప్పారు.

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ చేతుల మీదుగా ప్రమాణం చేయడానికి సిద్ధపడుతూ సోమవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. పక్కనే ఒబామా సతీమణి మిచెల్లీ బైబిల్ చేతబట్టి...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ చేతుల మీదుగా ప్రమాణం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. పక్కనే ఒబామా సతీమణి మిచెల్లీ బైబిల్ చేతబట్టి...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో బెనెడిక్షన్ వింటూ బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జ్యో బిడెన్.

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అభినందనలు తెలుపుతున్న విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్.

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో ముచ్చటిస్తూ ఇలా...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న బరాక్ ఒబామా..

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

బరాక్ ఒబామాతో గాయని కెల్లీ క్లార్క్‌సన్... ఎడమ పక్కన ఉపాధ్యక్షుడు జ్యో బిడెన్...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

తన ప్రసంగం తర్వాత అభివాదం చేస్తూ బరాక్ ఒబామా... హర్షధ్వానాలు చేస్తున్న ఉపాధ్యక్షుడు జ్యో బిడెన్...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

తన నేత అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న సందర్భంగా బరాక్ ఒబామా మద్దతుదారులు వాషింగ్టన్ నేషనల్ మాల్‌లో సందడి చేస్తూ ఇలా...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

వాషింగ్టన్‌లోని సెయింట్ జాన్స్ చర్చికి తన కూతుళ్లు శషా, మాల్యా, భార్య మిచెల్లీ, అత్త మార్యన్ రాబిన్సన్‌లతో వెళ్తూ అభివాదం చేస్తున్న బరాక్ ఒబామా...

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

ప్రెసిడెన్షియల్ బాక్స్ నుంచి ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకిస్తున్న ఒబామా కూతుళ్లు మాల్యా (కుడిపక్కన), శషా ఒబామా (ఎడమ పక్కన)

పిక్చర్స్: ఒబామా ప్రమాణం రోజు ఇలా

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం తర్వాత ప్రారంభ పరేడ్ సందర్భంగా వాషింగ్టన్‌లోని పెన్సిల్వేనియా ఎవెన్యూలో అభివాదం చేస్తూ ఒబామా, మిచెల్లీ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+