వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వచ్చేస్తుంది: పాల్వాయి, విందు రాజకీయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palvai Goverdhan Reddy
న్యూఢిల్లీ/హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత తెలంగాణ వస్తుందన్న నమ్మకం తనకు ఏర్పడిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాను ఉదయం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తనకు పూర్తి నమ్మకం కలిగిందన్నారు.

త్వరలో అనుకూల ప్రకటన రాబోతుందన్నారు. అనుకూల నిర్ణయం వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెరాస విలీనం ద్వారా కాంగ్రెసు పార్టీ లాభపడుతుందని చెప్పారు. తాను ఇదే విషయాన్ని సోనియా గాంధీకి తెలియజేశానని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

ప్రధానికి, సోనియాకు నారాయణ లేఖ

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం లేఖలు రాశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించాలని, గడువులోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన అందులో విజ్ఞప్తి చేశారు.

ప్యాకేజీలు వద్దు

తాము ప్రత్యేక రాష్ట్రం తప్ప మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాదులో అన్నారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు 25న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. మహాధర్నా విజయవంతం చేయాలని ఆమె తెలంగాణవాదులను కోరారు.

ఢిల్లీలో విందు రాజకీయాలు

తెలంగాణ, సమైక్యాంధ్రల కోసం ఢిల్లీ వెళ్లిన నేతలు అక్కడ విందు రాజకీయాలు నెరపుతున్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సమైక్యాంధ్ర కోసం వచ్చిన సీమాంధ్ర నేతలకు బుధవారం విందు ఇచ్చారు. తెలంగాణ ప్రాంత నేతలకు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విందు ఇచ్చారు.

English summary

 Congress MP Palvai Goverdhan Reddy has met AICC president Sonia Gandhi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X