హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహకారానికి జగన్ పార్టీ దూరం!: స్థానిక 'ఆకర్ష్' కోసమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: త్వరలో జరగనున్న సహకార ఎన్నికలకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ దాదాపు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నేతలను దూరం చేసుకోవద్దనే భావనతోనే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పార్టీలో ఉత్సాహం నింపాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని అధినాయకత్వం తొలుత భావించింది. ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీలకతీతంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే పేరుకే పార్టీలకతీతంగా అయినప్పటికీ ఆయా పార్టీలు తమ తమ మద్దతుదారులను బరిలోకి దింపి గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు.

దీంతో తమ మద్దతుదారులను బరిలోకి దింపి క్షేత్ర స్థాయిలో బలమైన పునాది వేసుకోవటం ద్వారా పట్టు నిరూపించుకోవాలని జగన్ పార్టీ భావించింది. ఇందుకోసం కసరత్తు చేసింది. కానీ, ఈ ఎన్నికల్లో పాల్గొనటం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత మరో అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పార్టీలకతీతంగా జరిగే సహకార ఎన్నికల్లో పోటీ చేస్తే బలం పెంచుకోవడం కంటే ఇప్పుడిప్పుడే తమ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న వారిని దూరం చేసుకోవడానికి దారి తీస్తుందని అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారట.

పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సహకార ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే సంకేతాలు పార్టీ నేతలకు ఇప్పటికే ఇచ్చారట. సహకార ఎన్నికలకు దూరంగా ఉండాలని, అదే సమయంలో ఎవరైనా పార్టీ మద్దతుదారులు పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉంటే అభ్యంతరం పెట్టవద్దని పార్టీ నాయకత్వం నిర్ణయించిందట.

English summary
It is said that YSR Congress party may not contest in co-operative elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X