జైలుకెళ్లేంత సంపాదనెందుకు? త్వరలో తెలంగాణ: సిఎం

తెలంగాణపై త్వరలో అనిశ్చితి తొలగిపోతుందని ఆయన చెప్పారు. కేంద్రం ఆ దిశలో చర్యలు ప్రారంభించిందన్నారు. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం వస్తుందని, సానుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అరెస్టుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మత ఘర్షణలు సృష్టించే వారుపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో ఉపేక్షించేంది లేదన్నారు.
రాజకీయ నాయకులు అయినా ఎవరైనా గౌరవంగా బతకాలని, గౌరవంగానే డబ్బు సంపాదించాలని అంతేతప్ప జైలుకెళ్లేంత డబ్బు సంపాదించడమెందుకని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications