ఆటోడ్రైవర్ కూతురు సిఏ టాపర్: తమిళనాట అభినందన

1990లలో అతను తన స్వగ్రామం తమిళనాడులోని వల్లిపురం జిల్లాలోని శంకరపురం నుండి ఉద్యోగం వెతుక్కునేందుకు ముంబై వెళ్లాడు. ఆ తర్వాత ఆటో నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు. ప్రేమతో పాటు అతని కొడుకు ధనరాజ్ కూడా ఇదే ఏడాది సిఏను తన సోదరితో పాటు ఫస్ట్ అటెంప్ట్‌లోనే పూర్తి చేసుకున్నాడు.
ఈ పరీక్షలు గత నవంబరులో నిర్వహించబడ్డాయి. ఫలితాలను సోమవారం ప్రకటించారు. తాను టాపర్‌గా నిలవడాన్ని థ్రిల్‌గా ఫీల్ అవుతున్నానని, తనతో పాటు సోదరుడు కష్టపడి చదివామని, అందుకు ఫలితం దక్కిందని ప్రేమ అన్నారు. తమ తల్లిదండ్రులు తమ కోసం ఎంతో కష్టపడ్డారని, వారి త్యాగం కారణంగానే తాను, తన సోదరుడు బాగా చదువగల్గుతున్నామని చెప్పారు.
ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఐదుగురు ముంబైలోని ఓ ప్రాంతంలో ఒకే గదిలో జీవనం సాగిస్తున్నారు. వీరు స్థానిక మున్సిపల్ పాఠశాలలో చదివారు. తమిళాన్ని సెకండ్ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నారు. సిఏ పరీక్షల్లో ప్రేమ 800 మార్కులకు గాను 607 మార్కులు సాధించింది.
సిఏ పరీక్షలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థిని వనజ జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించింది. ఈమె బికాం మొదటి సంవత్సరం చదువుతున్న వనజ మొత్తం 200 మార్కులకు 185 సాధించింది.
కరుణానిధి అభినందన, బహుమతి
సిఏలో టాపర్‌గా నిలిచిన ప్రేమకు తమిళనాడులో అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ ప్రతిభను మెచ్చిన మంత్రి వాసన్ ఆమెకు రూ.5 లక్షల బహుమతి ప్రకటించారు. డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి ప్రేమకు రూ.లక్ష బహుమతి ప్రకటించారు.












Click it and Unblock the Notifications