ఇంక్‌చల్లిన వ్యక్తిని క్షమించిన రామ్‌దేవ్, పాదాభివందనం

నేను ఒక సన్యాసిని అని, తనకు అతడిపై ద్వేషం లేదన్నారు. క్షమించి వదిలేయమని కోర్టుకు తెలిపారు. అతడు తప్పు చేశాడని కానీ, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడబోడని న్యాయమూర్తి ఎదుట రామ్‌దేవ్ బాబా చెప్పారు. వెంటనే స్పందించిన సిద్ధిఖీ తాను తప్పు చేశానంటూ రాందేవ్ పాదాలపై పడ్డాడు.
చేసిన పనికి సిగ్గుపడుతున్నానని తనని క్షమించాలని వేడుకున్నాడు. సిద్ధిఖీ తప్పును క్షమించేందుకు రామ్‌దేవ్ సిద్ధపడినందున ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదని సిద్ధిఖీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో కేసు విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి అంబికా సింగ్ ప్రకటించారు.
కాగా రామ్‌దేవ్ ముఖంపై గత ఏడాది సిద్దిఖీ నల్ల సిరా చల్లి విషయం తెలిసిందే. అవినీతి, నల్లధనంపై మీడియా ప్రతినిధుల సమావేశంలో అతడు రామ్‌దేవ్‌పై సిరా చల్లాడు. ఆయన ముఖంపై, దుస్తులపై సిరా పడింది. దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటనపై బాబా రామ్‌దేవ్ తర్వాత ప్రతిస్పందించారు. తాను చేసినదానికి ఇది సరైందేనని ఆయన అన్నారు. ఆ వ్యక్తిని రామ్‌దేవ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాదారు.












Click it and Unblock the Notifications