వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు: తాతతో మనవడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ముప్పయ్యవ పుట్టిన రోజు వేడుకలు పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో బుధవారం ఘనంగా జరిగాయి. తెలుగు యువత, తెలుగునాడు విద్యార్థుల సమాఖ్యల ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.

NTR-Nara Lokesh

పుట్టిన రోజును పురస్కరించుకొని తెలుగు యువత, తెలుగునాడు ముప్పై కిలోల కేక్‌ను కోసి, బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు పక్కనే ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లోకేష్ పైన పొగడ్తల వర్షం కురిపించారు. అతను తాత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తగిన మనువడు, చంద్రబాబు నాయుడుకు తగ్గ వారసుడు అని కొనియాడారు.

లోకేష్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజల బాగుకోసం లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి కృషి చేయాలన్నారు. కాగా వారంతా బాబు ఇంటికి వెళ్లి లోకేష్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు యువత అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ట్విట్టర్‌లో తాతతో మనువడు

జనవరి 18వ తేదిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నారా - నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆయనకు నివాళులు అర్పించారు. నారా లోకేష్ కూడా మామ బాలకృష్ణతో పాటు వచ్చి రసూల్‌పురా నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అదే రోజు అతను ట్విట్టర్‌లో తన తాతతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి గత స్మృతులను గుర్తుకు చేసుకున్నాడు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's son Nara Lokesh celebrates his 30th birthday with Telugu Yuvatha workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X