షాకిచ్చిన విప్ నాని: కష్టకాలంలో..జగన్ పార్టీలోకి జంప్

Perni Nani - YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి విప్, బందరు శాసనసభ్యుడు పేర్ని నాని షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెసు పార్టీకి, విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నాని చెప్పారు. గురువారం ఉదయం ములాకత్ సమయంలో పేర్ని నాని అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తాను ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్ జగన్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తాను కష్టకాలంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

తన నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకే తాను జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు. ఎప్పుడు చేరుతాననే విషయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశ్య పూర్వకంగా కాంగ్రెసు పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. బందరు పోర్టు కోసం పేర్ని నాని 2004, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జగన్‌కు బెయిల్ తిరస్కరించడం దురదృష్టకరం

జగన్‌కు బెయిల్ తిరస్కరించడం దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం వేరుగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే అక్రమాలు జరిగినట్లు ఎలా నిర్ధారిస్తారని ఆమె ప్రశ్నించారు. ఏ ఆధారాలతో జగన్‌ను అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వం సహకరించకపోతే ముఖ్యమంత్రిని, సిఎస్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+