వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇచ్చేట్లు లేదు: కెసిఆర్, 5గురు చాలు: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Harish Rao
హైదరాబాద్: ఐదుగురు తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ క్షణంలోనైనా పడిపోవచ్చునని ఆయన శుక్రవారం అన్నారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకపోతే తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన అన్నారు.

సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంత మంత్రులు రాజీనామాలు చేస్తామని అంటుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. ముందు ఇంటి దొంగల భరతం పట్టాలని అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు తెలంగాణ ప్రాంతంలో కనుమరుగై పోతుందని ఆయన అన్నారు. తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

సీమాంధ్ర నేతలకు ధీటుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. 2014లో తెలంగాణను కచ్చితంగా సాధిస్తామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము 100 అసెంబ్లీ స్థానాలు, 15 పార్లమెంటు సీట్లు సాధించుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

సమరదీక్ష 36 గంటలు చేయాలని, ఈ దీక్ష తమ పార్టీ శాసనసభ్యులు పాల్గొంటారని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించాలని ఆయన కోరారు. కరీంనగర్‌లో స్వామి గౌడ్‌ను గెలిపించే బాధ్యత ఉద్యోగ సంఘాలదేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు సముఖంగా లేదని, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కెసిఆర్‌తో సమావేశమయ్యారు.

English summary
Telangana Rastra Samith (TRS) president K Chandrasekhar Rao has said that Congress is not interseted to carve Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X