అక్కడా జగనే: తెలంగాణపై చక్రం తిప్పారా? మారిన సీన్

తెలంగాణ ఇచ్చినా...
కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినా కాంగ్రెసు పార్టీకి వచ్చే లాభం ఏమీ తెలంగాణలో ఉండదని, తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కంటే కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే బలంగా ఉందని నివేదిక ఇచ్చారట. తమ వాదనలు సరైనవే అని చెప్పేందుకు వారు లెక్కలతో సహా కాంగ్రెసు పార్టీ పెద్దల ముందు ఉంచారని అంటున్నారు.
2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జగన్ పార్టీ మరింత బలం పుంజుకుంటుందని చెప్పారట. తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో ఆ పార్టీ కూడా క్రమంగా పుంజుకుంటోందని వివరించారట. ఈ ప్రభావం మొత్తం తెరాస పైన పడుతుందని తెలియజేశారట. రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో ఓటమి చవి చూసినా కేంద్రంలో రాహుల్ గాంధీకి జగన్ మద్దతిస్తారని, విభజిస్తే అలాంటి అవకాశాలు ఉండవని నచ్చజెప్పారట. తెలంగాణలోనూ కొన్ని సీట్లు నెగ్గగలమని చెప్పారట.
విభజన జరిగితే మాత్రం సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని అదే సమయంలో తెలంగాణలోనూ అంతగా ప్రభావం చూపదని చెప్పారని అంటున్నారు. మూడుచోట్ల జగన్ పార్టీయే బలంగా ఉందని వారు చెప్పారట. సీమాంధ్ర నేతల లెక్కల కారణంగానే అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చిందని, దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని అంటున్నారు. తెలంగాణ ఇచ్చినా మూడు ప్రాంతాల్లో జగన్ హవానే కొనసాగుతుందనే సీమాంధ్ర నేతల వాదనే అధిష్టానం వైఖరిలో మార్పుకు కారణమని చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వాయిదాకు వివిధ కారణాలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications