'బాబు ఆరోగ్యంపై ఫ్యామిలికీ చెప్పాం': బాబు ససేమీరా

Chandrababu Naidu
విజయవాడ: వస్తున్నా మీకోసం పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం చూస్తుంటే ఆయన సన్నిహితుడిగా తనకు చాలా బాధేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గరికపాటి రామ్మోహన రావు శుక్రవారం అన్నారు. ఆయన కాలికి గాయం తిరగబెట్టిందని, రెండు రోజులుగా నడుం నొప్పితో బాధపడుతున్నారన్నారు. వైద్యులు పాదయాత్ర ఆపేయాలని సూచించారన్నారు.

తాము కూడా అధ్యక్షుడికి పాదయాత్ర ఆపేయాలని విజ్ఞప్తి చేశామని కానీ, ఆయన ససేమీరా అంటున్నారన్నారు. ఆయన కాలు బాగా వాసిపోయిందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారన్నారు.

తల్లిపాము, పిల్లపాము

చంద్రబాబు పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఐదో రోజు కొనసాగుతోంది. నందిగామ శివారు అంబారుపేటలో బాబు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలువురు నేతలు తనను కలిసి పాదయాత్ర ముగించాలని విజ్ఞప్తి చేస్తున్నారని కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన తాను యాత్రను అలాగే కొనసాగిస్తానని చెప్పారు. కాలి నొప్పి కారణంగా నిదానంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు తల్లిపాము పిల్లపాము వంటివని ఆయన ధ్వజమెత్తారు. వాటికి విషం ఎక్కువ అన్నారు. దొంగలు దొంగలు కలిసిపోయారని, మంచి వాళ్లంతా ఓ పక్కకు చేరాలని పిలుపునిచ్చారు. అప్పుడే దొంగల భరతం పట్టవచ్చునని అన్నారు. అవినీతిపరులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తూ పరిపాలనను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+