గో బ్యాగ్: సిటీలో 'తెలంగాణ యువసేన' పోస్టర్ల కలకలం

Telangana
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో తెలంగాణ యువసేన పోస్టర్లు కలకలం సృష్టించాయి. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గత నెల జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై తేల్చేస్తామని చెప్పడం, తేదీ దగ్గర పడుతుండటం, తాజాగా కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతారవరణం వేడెక్కింది.

ఇదే సమయంలో నగరంలో తెలంగాణ యువసేన పేరిట పోస్టర్లు వెలిశాయి. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. ఆంధ్రా గో బ్యాక్, తెలంగాణ సాధనే మా లక్ష్యం అంటూ పలు పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు హైదరాబాదు శివార్లలోని వనస్థలిపురం, కొత్తగూడెం బ్రిడ్జిపై వెలిశాయి. తెలంగాణ ప్రకటన పైన కాంగ్రెసు వెనక్కి వెళ్లడంతో తెలంగాణవ్యాప్తంగా ఉద్యమం వేడి రాజుకుంటున్న విషయం తెలిసిందే.

టిజెఏసి స్టీరింగ్ కమిటీ భేటీ

ఈ రోజు తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన, ఇటీవల కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యల పైన, భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించనున్నారు. ఉద్యోగ సంఘ జెఏసి నేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రోజు మధ్యాహ్నం భేటీ కానున్నారు.

మంద జగన్నాధం ఇంట్లో ఎంపీల భేటీ

నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం ఇంట్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. కాంగ్రెసు పార్టీ పెద్దల వ్యాఖ్యలపై వారు చర్చిస్తారు. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+