పెట్రోల్ బాటిళ్లతో కెయులో ఉద్రిక్తత: ఇందిరాపార్కు వద్దా

పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని టిజివిపి డిమాండ్ చేసింది. ఉపకులపతి అనుమతులు లేకుండా ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. వారు పెట్రోలు బాటిళ్లతో గది ముందు కూర్చున్నారు. పోలీసులు మరోసారి ఇలా రాకుండా హెచ్చరించాలని ఉపకులపతిని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనుమతులు లేకుండా పోలీసులు రావొద్దన్నారు.
నిజాం హాస్టల్‌లో..
నిజాం హాస్టల్‌లో విద్యార్థులు ఆందోైళనకు దిగారు. ట్యూషన్ కోసం వెళ్తున్న తమ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని వారు ఆరోపించారు. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి.
సుదర్శన్ రెడ్డి ఇంటి ముట్టడి
భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిని భారతీయ జనతా పార్టీ గురువారం ముట్టడించింది. తెలంగాణ కోసం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్తత
జెఏసి ఆధ్వర్యంలో సమరదీక్ష కొనసాగుతున్న ఇందిరాపార్కు ప్రాంతంలో సోమవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగించుకొని గన్ పార్కుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు ఓయు నుండి ర్యాలీకి విద్యార్థులు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు విశ్వవిద్యాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications