నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై హెచ్-1బి ప్రొఫెషనల్స్ విజ్ఞప్తి

US Visa
హైదరాబాద్: నాన్ ఇమిగ్రెంట్ వీసాల రీఇష్యూయెన్స్‌ విషయంలో మార్దదర్శక సూత్రాలను మార్చాలనిఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోరుతూ హెచ్-1బి ప్రొఫెషనల్స్ కమ్యూనిటీ సభ్యులు ప్రచారం ప్రారంభించారు. న్యాయ కార్యాలయాలకు చెందిన రాజీవ్, ఎస్. ఖన్నా, పిసిల సహకారంతో వారు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. హెచ్-1, ఓ-1, ఎఫ్-1వంటి స్టూడెంట్, ఫ్యామిలీ వీసాలతో పాటు వాటిని తిరిగి జారీ చేసే పద్ధతిని అనుమతించాలని వారు కోరుతున్నారు.

విదేశాలకు వెళ్లి రీస్టాంపింగ్ చేయించుకునే సమస్య దానివల్ల తీరుతుందని వారంటున్నారు. ఇతర దేశాల్లో ప్రయాణించిన తర్వాత తిరిగి అమెరికాలోకి తిరిగి ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. అమెరికాలోని ఉద్యోగాలు కల్పించేవారికి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు, హెచ్-1బి వీసా హోల్డర్లకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

నాన్ - ఇమిగ్రేషన్ వీసాల మార్గదర్శక సూత్రాలను సవరించాలని వారు కోరుతున్నారు. లబ్ధిదారుడికి ఇప్పటికే నాన్ - ఇమిగ్రేషన్ వీసా ఉన్నప్పుడు, విదేశీ పర్యటనలకు దాన్నే తిరిగి జారీ చేయడం ఎందుకని వారు అడుగుతున్నారు. ప్రస్తుత విధానాన్ని సమీక్షించి, సరైన చర్యలకు విధానపరమైన నిపుణులకు నివేదించాలని వారు కోరారు. బరాక్ ఒబామాకు సమర్పించడానికి ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 23వ తేదీలోగా వంద వేల ఆన్‌లైన్ సంతకాల అవసరం ఉంది.

13 ఏళ్ల వయస్సు పైబడినవారు ఎవరైనా పిటిషన్‌పై సంతకం చేయవచ్చు. జాతి, నివాస ప్రాంతాలతో ప్రమేయం లేకుండా ఈ సంతకాలు చేయవచ్చు. లింక్‌పై క్లిక్ చేసి మొదటి, చివరి పేర్లను, ఈ మెయిల్ ఐడిని చేర్చి ప్రవేశిస్తే సరిపోతుంది. జిప్ కోడ్‌ను యాడ్ చేయడం ఇష్టంపై ఆధారపడి ఉంది.

ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి ఆన్‌లైన్ ప్రచారానికి దోహద పడవచ్చు. సంతకం చేయడానికి ఈ యుఆర్ఎల్‌ను క్లిక్ చేయండి.

https://petitions.whitehouse.gov/petition/please-reinstate-reissuance-nonimmigrant-visas-within-usa/R9MgSQ4Y?utm_source=wh.gov&utm_medium=shorturl&utm_campaign=shorturl

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+