ఒబామాకి ఫోన్ చేస్తా!: అధ్యక్షుడి బాబాయ్‌కి నోటీసులు

ఒబామా బాబాయ్ ఓన్యాంగ్ ఒబామా 1963లో తన పదిహేడేళ్ల వయస్సులో విద్యాభ్యాసం కోసం కెన్యా నుండి అమెరికాకు వచ్చాడు. ఆయన 1970లో అమెరికాను విడిచి వెళ్లవలసి ఉంది. కానీ ఆయన అక్కడే ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాడు. 1992లో మొదటిసారి కోర్టు ఆయనకు దేశం విడిచి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన మాత్రం మసాచ్యూసేట్స్‌లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు.
ఈ 21 ఏళ్లు ఆయన ఎవరికీ కనిపించకుండా తన పని తాను చేసుకుపోయాడు. అయితే 2011లో మద్యం తాగి వాహనం నడుపుతున్న కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన అనధికారంగా అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించారు. గురువారం ఆయనను కోర్టులో హాజరు పర్చారు. 50 ఏళ్లుగా తాను అమెరికాలో నివసిస్తున్నానని తనకి అమెరికా పౌరసౌత్వం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
అయితే ఒబామా ప్రకటన తర్వాత ఆయనకు నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఏం చేస్తారని అడిగితే.. శ్వేత సౌధానికి ఫోన్ చేస్తానని చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!