తెలంగాణకు సుమన్ మద్దతు: బాబు కోసం లగడపాటి

సహకార ఎన్నికలకు, తెలంగాణవాదానికి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు వేరుగా అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.
తెలంగాణవాదులు విభజన జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజయవాడలో ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఏకాభిప్రాయం లేకుండా విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే ప్రసక్తి లేదని ఆయన మరోసారి అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై తన వైఖరి మార్చుకునే వరకు తాము ఆయనకు వ్యతిరేకంగా కనువిప్పు కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని చెప్పారు. ఈ నెల 9న ఏఎన్‌యులో సమావేశం ఉంటుందన్నారు. చంద్రబాబు తనతో మాట్లాడేందుకు అంగీకరిస్తే తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కాగా వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపడుతున్న చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి లగడపాటి వస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బాబు బస చేసిన ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. లగడపాటి విజయవాడలో సమైక్యాంధ్ర ర్యాలీని ఉదయం నిర్వహించారు.












Click it and Unblock the Notifications