బాబు నో: లగడపాటి హల్‌చల్, సిక్స్‌ప్యాక్... దేవినేని

పోలీసులు లగడపాటిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విద్యార్థులు భారీ ర్యాలీగా రావడంతో ట్రాఫిక్ జాం అయింది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు పోలీసులు లగడపాటిని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు. ఆయనను మరొకచోటుకు తరలించారు. బాబు అనుమతిస్తేనే తాను తెలంగాణపై నిర్ణయం మార్చుకోవాలని తాను లేఖ ఇస్తానని లగడపాటి పోలీసులు, టిడిపి కార్యకర్తలతో చెప్పారు.
అయితే తమ పార్టీ అధ్యక్షుడు లగడపాటిని కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదని టిడిపి నేతలు అన్నారు. బాబు అనుమతించలేదని చెప్పినా లగడపాటి టిడిపి అధినేత శిబిరం వద్దకు బయల్దేరడం గమనార్హం. లగడపాటి తీరుపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.
లగడపాటి ఓ పిచ్చివాడని, రాజకీయ దళారి అని, బ్రోకర్ అని దేవినేని నిప్పులు చెరిగారు. సిక్స్ ఫ్యాక్ రాజగోపాల్ అంటూ ఎద్దేవా చేశారు. కాగా అంతకుముందు లగడపాటి వస్తున్నాడనే సమాచారం రావడంతో పోలీసులు భారీగా బాబు బస చేసిన ప్రాంతం వద్ద మోహరించారు. కాగా ఈ నెల 9న బాబును తాను ఎట్టి పరిస్థితుల్లో కలుస్తానని లగడపాటి చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!