వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌ను చప్రాసీలా.:నారాయణ, తెలంగాణలో గెలిస్తే: టిజి

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPI Narayana
హైదరాబాద్/కర్నూలు: కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చప్రాసీలా ఢిల్లీకి తిప్పుంచుకుంటోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం మండిపడ్డారు. తెలంగాణలోని పరిస్థితులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు.

కేంద్రం మరోసారి చర్చలు అని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. మళ్లీ చర్చలు అనుకున్నప్పుడు అఖిల పక్ష సమావేశం ఎందుకన్నారు. తెలంగాణపై సంప్రదింపులు జరుపుతామని కేంద్ర పెద్దలు చెబితే.. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో గత నెల జరిగిన అఖిల పక్ష సమావేశాన్ని అవమానించినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణపై నాన్చకుండా వెంటనే తేల్చాలన్నారు.

రాజకీయ పార్టీలు బజారు పార్టీలుగా మారాయని ఆయన మండిపడ్డారు. రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పారు. తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం సోనియానేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై స్పష్టమైన ప్రకటనతో రావాలన్నారు. కిరణ్ ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలుబొమ్మ అని విమర్శించారు.

తెలంగాణలో కూడా సీట్లు గెలిస్తే..

కాంగ్రెసు పార్టీ సమైక్య నినాదం వల్లే సహకార ఎన్నికలలో తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ కర్నూలు జిల్లాలో అన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తే రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు.

24న కెసిఆర్ ఇంటిని ముట్టడిస్తాం

ఈ నెల 24వ తేదిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటిని ముట్టడిస్తామని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి సోమవారం ప్రకటించింది. హైదరాబాదులోని ఆయన ఇంటిని ముట్టడించి బంజారాహిల్స్ పోలీసులకు ఆయనను అప్పగిస్తామని చెప్పారు.

English summary
CPI state secretary Narayana said PM Manmohan Singh and AICC president Sonia Gandhi know Situations in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X