భూమిపై చోటు లేదు.. చంద్రుడిపై ‘ఏఐ’ డేటా సెంటర్లు: ఎలాన్ మస్క్ సంచలన ప్లాన్!

ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడూ సాధారణ మానవుడి ఊహకు అందవు. ఎలాన్ మస్క్ తాజాగా ప్రతిపాదించిన ఓ సరికొత్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్, అంతరిక్ష రంగాల్లో పెను సంచలనంగా మారింది. ఏఐ భవిష్యత్తు అవసరాలను తీర్చడం భూమికి సాధ్యం కాకపోవచ్చని.. అందుకే చంద్రుడిపై 'రైల్‌గన్'తరహా డేటా సెంటర్లను నిర్మించడమే దీనికి ఏకైక మార్గమని ఎలాన్ మస్క్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి వచ్చారు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ 'జేపీ మోర్గాన్ చేజ్' సీఈవో జేమీ డిమాన్‌తో జరిగిన ఓ ప్రత్యేక సంభాషణలో స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఈ మైండ్ బ్లోయింగ్ విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలకు అవసరమయ్యే భారీ కంప్యూటింగ్ శక్తిని మోయడానికి భూమిపై ఉన్న వనరులు ఏమాత్రం సరిపోవని, అందుకే చంద్రుడిని ఓ పారిశ్రామిక స్థావరంలా మార్చాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.

ట్రంప్ 'ఇజ్రాయెల్’ వ్యూహం: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్!
ట్రంప్ 'ఇజ్రాయెల్’ వ్యూహం: చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ అవసరాల ఆధారంగా ఎలాన్ మస్క్ ఈ అంచనాకు వచ్చారు. భూమిపై నుంచి మనం ఏటా కేవలం ఓ టెరావాట్ సామర్థ్యం గల ఏఐ స్పేస్ కంప్యూటింగ్‌ను మాత్రమే నిర్వహించగలమని, అదే చంద్రుడిని గనక వినియోగిస్తే ఏకంగా 1,000 టెరావాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యాన్ని చాలా సులభంగా అందుకోవచ్చని ఎలాన్ మస్క్ గణాంకాలతో సహా వివరించారు. ప్రస్తుతం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐ మోడల్స్ అభివృద్ధి కోసం వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. దీని వల్ల విపరీతమైన విద్యుత్ కొరత, భూమి లభ్యత తగ్గడం, సర్వర్ల కూలింగ్ కోసం నీటి కొరత వంటి అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. భూమిపై రోజురోజుకు పెరుగుతున్న ఈ భౌతిక పరిమితులను, పర్యావరణ అనుమతుల అడ్డంకులను అధిగమించడానికి చంద్రుడే తదుపరి ఏఐ మౌలిక సదుపాయాల వేదిక కాబోతుందని ఎలాన్ మస్క్ బలంగా నమ్ముతున్నారు.

Elon Musk AI Moon Plan Railgun Data Centres To Expand Computing 1 000x Beyond Earth Full Details

రైల్‌గన్‌తో చందమామపై డేటా సెంటర్లు
చంద్రుడిని ఎంచుకోవడానికి వెనుక గల సైంటిఫిక్ కారణాలను కూడా ఎలాన్ మస్క్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం, భూమితో పోలిస్తే కేవలం ఆరో వంతు మాత్రమే గురుత్వాకర్షణ శక్తి ఉండటం చంద్రుడికి ఉన్న అతిపెద్ద భౌతిక అనుకూలతలని ఆయన వెల్లడించారు. ఈ అనుకూలతల వల్ల అంతరిక్షంలోకి భారీ డేటా సెంటర్లను పంపడానికి ఖరీదైన సాంప్రదాయ రాకెట్లతో అస్సలు పనిలేదు. దానికి బదులుగా విద్యుదయస్కాంత శక్తితో పనిచేసే 'రైల్‌గన్ లేదా మాస్ డ్రైవర్' ద్వారా ఏఐ డేటా సెంటర్లను అంతరిక్షంలోకి నేరుగా షూట్ చేయవచ్చని ఎలాన్ మస్క్ చెప్పారు. భూమిపై అయితే దట్టమైన వాతావరణం, గాలి ఘర్షణ, గురుత్వాకర్షణ , వాతావరణ మార్పుల వల్ల ఇటువంటి ప్రయోగాలు అసాధ్యం. కానీ చంద్రుడిపై ఎటువంటి గాలి నిరోధం లేని క్లీన్ ఎగ్జిట్ పాత్ లభిస్తుందని, దీనివల్ల అతి తక్కువ ఇంధనం లేదా శ్రమతో భారీ పరికరాలను అంతరిక్షంలోకి పంపవచ్చని ఆయన శాస్త్రీయంగా వివరించారు.

Elon Musk: ఎలాన్ మస్క్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్
Elon Musk: ఎలాన్ మస్క్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్

చంద్రుడిపై మస్క్ 'ఏఐ' సామ్రాజ్యం!
అయితే ఎలాన్ మస్క్ చంద్రుడిని కేవలం ఓ తాత్కాలిక పరిశోధనా కేంద్రంగానో లేదా స్పేస్ స్టేషన్‌లానో చూడటం లేదు; ఆయన దానిని ఒక పూర్తి స్థాయి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై లభించే స్థానిక వనరులు, లోహాలను ఉపయోగించి అక్కడే భారీ సోలార్ ప్యానెల్స్, థర్మల్ రేడియేటర్లను తయారు చేయవచ్చని ఆయన వెల్లడించారు. ఈ వ్యవస్థల సహాయంతో అంతరిక్షంలో పరిభ్రమించే ఏఐ డేటా సెంటర్లకు నిరంతరాయంగా, అత్యంత శక్తివంతమైన సౌరశక్తిని అందించవచ్చు. భూమిపై లాగా పగలు, రాత్రి లేదా మేఘాలు కమ్మేయడం వంటి సమస్యలు అంతరిక్షంలో ఉండవు కాబట్టి ఏఐ కంప్యూటింగ్ నిరంతరాయంగా సాగుతుంది. ఈ ప్లాన్ గనక నిజమైతే, భూమిపై స్థల కొరత, గ్రిడ్ పవర్ సమస్యలు, ప్రభుత్వాల అనుమతుల వంటి ఎలాంటి తలనొప్పులు లేకుండానే ఏఐ సాంకేతికతను ఊహించని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చని ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. ఇక అంతరిక్షం అనేది కేవలం అన్వేషణ కోసం మాత్రమే కాదు, అది రాబోయే రోజుల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మారబోతుందనే పెద్ద మార్పును మస్క్ ఈ సందర్భంగా ప్రపంచానికి పరిచయం చేశారు.

అంగారక కలల ప్రాజెక్టుపై కీలక కామెంట్స్
ఈ చర్చలో ఎలాన్ మస్క్ తన కలల ప్రాజెక్టు అయిన అంగారక గ్రహ ప్రయాణం గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనుషులు నివసించేలా ఓ స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని మార్స్ కంటే ముందే చంద్రునిపై చాలా వేగంగా నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంగారకుడిపైకి వెళ్లడానికి చంద్రుడిని ఒక స్టాప్‌లా వాడుకోవాల్సిన అవసరం లేకపోయినా, భూమికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల చంద్రుడిని ఓ ప్రాక్టికల్ పారిశ్రామిక స్థావరంలా మార్చుకోవడం చాలా సులువవుతుందని స్పష్టం చేశారు. గ్రహాంతర నివాసాల ఏర్పాటులో స్పేస్‌ఎక్స్ సాధించాల్సిన ఎన్నో పాఠాలను చంద్రుడిపైనే ముందుగా నేర్చుకోవచ్చని మస్క్ భావిస్తున్నారు. మార్స్ ఎప్పటికైనా తన అంతిమ లక్ష్యమేనని పునరుద్ఘాటిస్తూ.. భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని మానవ మనుగడకు, ద్రవరూప సముద్రాలకు అనుకూలంగా మార్చే అపారమైన అవకాశం ఉంది.. అయితే ప్రస్తుతానికి మాత్రం భూమిని కాపాడుకుంటూ ఏఐ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చందమామే ఏకైక దిక్కు కానున్నాడని మస్క్ తన సరికొత్త అంతరిక్ష వ్యూహాన్ని ప్రపంచం ముందుంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+