ముద్దుకు మార్కులు!: లైంగిక వేధింపుల టీచర్ అరెస్టు

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. శరత్ చంద్ర ఇతర విద్యార్థినుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. శరత్ చంద్ర భార్య, పాఠశాల ప్రిన్సిపల్ ఈ ఘటనపై మాట్లాడేందుకు అందుబాటులో లేరు. పదో తరగతి పరీక్షల్లో మార్కులు వచ్చేలా చేస్తానని చెప్పి రెండు రోజుల క్రితం అమ్మాయికి ముద్దు పెట్టే ప్రయత్నాలు చేశాడు.
విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. నిందితుడు మొదట పరారయ్యాడు. పోలీసులు గాలించి సాయంత్రానికి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
పదో తరగతి విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో పిలిపించి శరత్ చంద్ర లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. బయటకు చెప్పుకోలేక విద్యార్థినులు చాలాకాలంగా కుమిలిపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న మణికంఠను ఉపాధ్యాయురాలు కొట్టగా ప్రశ్నించేందుకు బంధువులు మంగళవారం పాఠశాలకు వచ్చారు.












Click it and Unblock the Notifications