స్త్రీలకు ఢిల్లీలో భద్రత లేదు: రేప్ యత్నంపై షీలా షాక్

Sheila Dikshit
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలకు ఇప్పటికీ భద్రత లేదని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో కేబుల్ బిల్లు కోసం వచ్చిన యువకుడు ఇంట్లోని యువతిపై అత్యాచార యత్నం చేయగా, ఆమె అరిచింది. దీంతో అతను ఆమె నోట్లో ఇనుప రాడ్ కుక్కి పారిపోయాడు. ఈ ఘటనపై షీలా దీక్షిత్ బుధవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

లజ్‌పత నగర్ అత్యాచార యత్నం ఘటనకు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది తమకు మంచిది కాదని, మహిళలకు ఢిల్లీలో ఇప్పటికీ భద్రత లేదని ఆ సంఘటన రుజువు చేస్తోందని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

మహిళల భద్రతకు తాము చేపట్టాల్సిన చర్యలన్నింటినీ చేపడతామని, నగరంలో సమర్థమైన రవాణా సౌకర్యం కోసం నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. నగరంలో మహిళలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

లజ్‌పత్ నగర్‌లో యువతిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిపై సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో దాడి జరిగింది. గొంతుకు మర్నాడు శస్త్రచికిత్స జరిగింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+