మీడియా సృష్టే: తెలంగాణపై ఢిల్లీ చర్చలపై కిరణ్ రెడ్డి

Kiran Kumar Reddy
హైదరాబాద్: తన ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణపై వచ్చిందంతా మీడియా సృష్టేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను ఢిల్లీలో తమ కాంగ్రెసు పార్టీ జాతీయ నాయకులతోనూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడానని ఆయన చెప్పారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణపై త్వరితంగా నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సమాచారం తాను అందించినట్లు తెలిపారు. మిగతాది అంతా మీడియా ఊహాగానాలేనని ఆయన అన్నారు. మీడియా ఊహాగానాలు ఎలా చేస్తుందో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విషయంలో తేలిపోయిందని ఆయన బొత్సను చూపిస్తూ అన్నారు.

తెలంగాణపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే - వెంటనే నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పి వేదిక మీది నుంచి వెళ్లిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆయన చెప్పారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శానససభ్యులు రాజీనామాలపై వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ - రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది తాను కాదని, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

రైతు సంక్షేమ కార్యక్రమాల కారణంగానే తాము సహకార ఎన్నికల్లో విజయం సాధించామని ఆయన చెప్పారు. తాము రైతుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. సహకార ఎన్నికల్లో విజయం వల్ల తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వరికి మద్దతు ధరను 70 రూపాయలు మాత్రమే పెంచారని ఆయన అన్నారు. రైతులకు మేలు జరిగే కార్యక్రమాలను చేపట్టాం కాబట్టే తమకు మద్దతు ఇచ్చారని చెప్పానని, ఉప ఎన్నికల్లో ఆమోదం, అనామోదం గురించి మాట్లాడలేదని ఆయన అన్నారు.

రైతు రుణాలపై 1.5 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని, నాలుగు శాతం వడ్డీని ఇతర రాష్ట్రాల్లో రైతులు భరిస్తుంటే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ఆయన చెప్పారు. జలయజ్ఞం ద్వారా ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించామని, 2014 చివరినాటికి మరో 30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఉగాది నుంచి బియ్యం మాత్రమే కాకుండా 9 నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+