విరుచుకుపడుతున్న అమెరికా: తిప్పికొడుతున్న ఇరాన్: మళ్లీ యుద్ధ జ్వాలలు

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఆ దేశానికి చెందిన 10 కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ పరిణామంతో తీవ్ర సంక్షోభంలో పడింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ఒక వాణిజ్య చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరపడంతో, అమెరికా ఈ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైన్యానికి చెందిన నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లను అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు ఈ దాడులు జరిపాయి. సుమారు రెండు మిలియన్ల బారెళ్ల ముడి చమురుతో పయనిస్తున్న 'కికు' అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్ వన్ వే డ్రోన్‌తో దాడి చేయడమే ఈ తాజా వైమానిక ప్రతీకార దాడులకు ప్రధాన కారణమని అమెరికా స్పష్టం చేసింది.

US Conduct fresh Strikes Iranian Targets Near Hormuz Strait After Drone Attack on Tanker Trump Warns

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తాము చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిస్థితి చేయి దాటితే ఇరాన్ ఉనికికే ముప్పు వస్తుందని హెచ్చరించారు. అటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరు దేశాల మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇరాన్ ముందుకు రావాలని, హింసతో సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడానికి ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది.. మొదటి నుంచీ. ఈ జలసంధి ద్వారా ప్రయాణించే ట్యాంకర్లు తమ ఆదేశాలను పాటించాలని, టోల్ ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖతార్ ఆయిల్ ఫీల్డ్స్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ కికు పై దాడి చోటు చేసుకుంది.

ఈ దాడులు ఇతర అరబ్, గల్ఫ్ దేశాలకూ విస్తరిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అమెరికా నౌకాదళానికి చెందిన అయిదో ఫ్లీట్ బహ్రెయిన్‌లోనే ఉండటం వల్ల దీన్ని టార్గెట్ గా చేసుకున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు.. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అమెరికా దాడులను తిప్పి కొడుతున్నామని వెల్లడించింది. దీంతో సముద్ర మార్గాల్లో ముప్పు మరింత పెరిగింది. అంతర్జాతీయంగా నౌకల తరలింపు ప్రక్రియలు కూడా తాత్కాలికంగా స్తంభించిపోయింది.

ప్రస్తుత తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలూ తుది శాంతి ఒప్పందానికి రావడానికి 60 రోజుల సమయం ఉంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడం, ఇరాన్ అణు రంగాన్ని అదుపు చేయడం వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో భాగం కానున్నాయి. ఇలాంటి దాడుల వల్ల ఈ శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, ఇది అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+