వాస్తు ప్రకారం ఎండు మిర్చిని కట్టి చూడండి: దోషాలకు అద్భుత రెమెడీ
వృద్ధి సాధించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం, కస్టమర్లు వచ్చి కూడా ఖాళీ చేతులతో వెనుదిరగడం వంటి సమస్యలు చాలా మంది వ్యాపారులను వేధిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కష్టపడటంతో పాటు జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల్లో సూచించిన కొన్ని సులభమైన పరిహారాలను పాటించడం వల్ల సానుకూల మార్పులు వస్తాయని విశ్వాసిస్తారు.
ముఖ్యంగా వంటింట్లో ఉపయోగించే ఎండుమిర్చితో కొన్ని ప్రత్యేక వాస్తు పరిహారాలు చేయడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన అడ్డంకులు తొలగిపోయి, లాభాల బాట పడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దుకాణానికి లేదా కార్యాలయానికి కస్టమర్లు వస్తున్నప్పటికీ, ఏమీ కొనకుండానే వెళ్లిపోతుంటే అక్కడ నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

దీనిని దూరం చేయడానికి ఒక మట్టి ప్రమిదలో కొద్దిగా కర్పూరం, రెండు ఎండుమిర్చి వేసి వెలిగించాలి. ఆ తర్వాత దాని నుంచి వచ్చే పొగను వ్యాపార స్థలం లేదా ఆఫీస్ అంతటా చూపించాలి. ఇలా చేయడం వల్ల అక్కడ పేరుకుపోయిన ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు.
రావలసిన డబ్బు తిరిగి రావడానికి సులభమైన మార్గం
వ్యాపారంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా పెట్టుబడి పెట్టిన సొమ్ము సకాలంలో తిరిగి రానప్పుడు సూర్యభగవానుడిని ఆరాధించడం మంచి మార్గం. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో 21 ఎండుమిర్చి గింజలను వేయాలి. ఆ తర్వాత సూర్యోదయ సమయంలో ఆ నీటిని సూర్యదేవునికి అర్ఘ్యంగా సమర్పించాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు విజయం, కీర్తిని ప్రసాదిస్తాడు. ఈ పరిహారం చేయడం వల్ల నిలిచిపోయిన డబ్బు త్వరగా చేతికి అందుతుంది. వ్యాపారంలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపిస్తుంది.
ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి కొన్ని పండు ఎర్రటి ఎండుమిర్చిలను స్వామివారికి సమర్పించి మనసారా ప్రార్థించాలి. ఈ చిన్న పరిహారం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడమే కాకుండా, చేపట్టిన వ్యాపార వ్యవహారాల్లో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయనే నమ్మకం ఉంది.
వ్యాపార పనుల ప్రారంభంలో అడ్డంకులు తొలగాలంటే..
ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు బయటకు వెళ్లేటప్పుడు అడ్డంకులు పదేపదే ఎదురైతే ఈ పరిహారం పాటించవచ్చు. ఇంటి నుంచి లేదా దుకాణం నుంచి బయటకు వెళ్లే ముందు అయిదు ఎండుమిరపలను గడపపై ఉంచాలి. వాటిని దాటుకుని వెళ్లాలి. ఇలా చేయడం వల్ల మార్గమధ్యంలో ఎదురయ్యే ఆటంకాలు వీడి, ఆ రోజు చేపట్టే కార్యాలన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని విశ్వాసం.
వ్యాపారంలో ఆర్థికంగా లాభాల బాట పట్టాలంటే నిరంతర శ్రమతో పాటు సానుకూల ఆలోచనలు చాలా అవసరం. వాస్తు శాస్త్రంలో చెప్పబడిన ఈ ఎర్ర మిరపకాయల పరిహారాలను పూర్తి నమ్మకంతో చేసినప్పుడు అనుకూలమైన మార్పులు కన్పిస్తాయి. వ్యాపార స్థలంలో ఎల్లప్పుడూ ఎలాంటి ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవన విధానాన్ని, సానుకూల వాతావరణాన్ని కాపాడుకోవడం ద్వారా క్రమంగా ఆర్థిక లాభాలు, వృద్ధి సాధించవచ్చు.












Click it and Unblock the Notifications