తెలంగాణ- ఏపీ మీదుగా అరుణాచలం, నాగపట్నం కు ప్రత్యేక రైళ్లు: రూట్, షెడ్యూల్..!!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వేలాంకన్ని లో జరగనున్న ఉత్సవాల వేళ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వేలాంకణిలో జరిగే వార్షిక ఉత్సవాలకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. వీరి కోసం ఉత్సవాల సమయంలో ఈ రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్ల రిజర్వేషన్లు ప్రారంభించారు. ఈ స్పెషల్ ట్రైన్స్ వెళ్లే మార్గం.. హాల్టింగ్ స్టేషన్లతో పాటుగా షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. వేలాంకన్ని వార్షికోత్సవాల వేళ దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 'బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్' చర్చి వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఏటా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. దీంతో.. ఈ సమయంలో రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. చర్లపల్లి నుంచి ఈ రైళ్లు నిర్వహించనున్నారు. ట్రైన్ నంబర్ 07127 సెప్టెంబర్ 8 మంగళవారం ఉదయం 7.40 గంట లకు చర్లపల్లిలో బయల్దేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు వేలంకని చేరుకుంటుంది.

రైల్వే అధికారుల సమాచారం
అదే విధంగా ట్రైన్ నంబర్ 07128సెప్టెంబర్ 9 బుధవారం వేలాంకని లో రాత్రి 11గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు 10.15గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు చర్లపల్లి నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలాడుతురై, నాగప్పట్టినం స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. కాగా.. ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 7 వరకు మహారాష్ట్ర నుంచి నడిపే ప్రత్యేక రైళ్ల జాబితాను ప్రకటించారు. ట్రైన్ నంబర్ 01161 : లోకమాన్య తిలక్ - వేలంకని రైలు ఆగస్టు 26, సెప్టెంబర్ 7న ప్రయాణించనున్నాయి. ఈ రైలు బుధ, సోమ వారాల్లో ఉదయం 11.50 గంటలకు బయల్దేరి శుక్ర, బుధవారాల్లో తెల్లవారుజామున 2గంటలకు వేలంకన్ని చేరుకుంటుంది. అదే విధంగా ట్రైన్ నంబర్ 01162 : వేలంకన్ని - లోకమాన్య తిలక్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు.













Click it and Unblock the Notifications