అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ అనూహ్య నిర్ణయం, కీలక నియామకం- కొత్త లెక్కలు..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల పైన నోటిఫికేషన్ జారీ అయింది. కీలక అంశాల పైన వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. సమావేశాలకు జగన్ తో పాటుగా పార్టీ ఎమ్మెల్యేల హాజరు పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇదే అంశం పైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో మండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకం పైన జగన్ తన నిర్ణయం వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం కీలక బిల్లుల ను సభలో ప్రవేశ పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. దీంతో.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. అసెంబ్లీకి జగన్ ఈ సారి హాజరవుతారనే చర్చ వేళ స్పష్టత ఇచ్చారు. సభ లో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు.. ఆ హోదా ఇవ్వకపోవటం ద్వారా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. సమావేశాలకు వెళ్లాలనుకున్న ఎమ్మెల్యేలు హాజరు కావచ్చని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్సీలు మాత్రం మండలిలో డీఎస్సీతో పాటుగా లా అండ్ ఆర్డర్ గురించి చర్చకు పట్టుబట్టాలని సూచించారు. ఇదే సమయంలో సభకు హాజరు కాని ఎమ్మెల్యేల పై వేటు వేస్తారనే చర్చకు జగన్ స్పందించారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. సిద్దంగానే ఉన్నామని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

 జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!
జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!
ys-jagan-decided-action-plan-amid-assembly-sessions-key-directions-for-party-mlcs-and-mlas-here

మండలి డిప్యూటీ ఛైర్మన్ గా తూామాటి

కాగా, ఇదే సమయంలో జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన జకియా ఖానం పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో వైసీపి అధినేత ఎవరికి ఈ పదవి ఇవ్వాలో సుదీర్ఘ కసరత్తు చేసారు. సామాజిక సమీకరణాలు, మరియు సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తూమాటి మాధవరావు పేరు ఖరారు చేసారు. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండగా.. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపికి పూర్తి స్థాయి స్పష్టమైన బలం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా లాంఛనం కానుంది. మండలిలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతగా జగన్ మాధవ రావు పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరుదు కల్యాణి పేరు పరిశీలన లోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్న వరుదు కల్యాణ్ కి పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించటం మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+