Kajal Aggarwal: విడాకులపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
Kajal Aggarwal: దేశంలో మారుతున్న అనుబంధాలు, విడాకుల కేసులు పెరుగుతున్న వేళ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనుషుల మధ్య అనుబంధాలు, ప్రేమ, పెళ్లిపై నేటి తరం ఆలోచనా విధానంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువహా ఉందని కాజల్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్లో కనిపించే జీవితాలతో తమ జీవితాలను పోల్చుకోవడం వల్లే దంపతులపై అదనపు ఒత్తిడి పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఫోన్ల వల్లే భార్యాభర్తల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతున్నాయని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సంబంధాలలో సంభాషణ, సహనం తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకరి మాట ఒకరు వినడానికి సమయం కేటాయించకపోవడం, భాగస్వామితో గడపాల్సిన సమయంలో కూడా ఫోన్లు, సోషల్ మీడియాలో మునిగి తేలడం దంపతుల మధ్య దూరాన్ని పెంచుతోందని కాజల్ చెప్పుకొచ్చారు.
తన భర్త గౌతమ్ కిచ్లుతో ఉన్న బంధాన్న దృఢంగా ఉంచుకోవడానికి వారు పాటించే ఓ చిన్న నియమాన్ని కాజల్ పంచుకున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. వారు ప్రతివారం ఓ రాత్రి కలిసి డిన్నర్‌కు వెళ్తారట. ఆ సమయంలో ఇద్దరూ తమ మొబైల్ ఫోన్లను పక్కన పెట్టేసి.. డిన్నర్ టేబుల్ వద్ద ఎలాంటి డిజిటల్ ఆటంకాలు లేకుండా కేవలం ఒకరికొకరు మాత్రమే సమయం కేటాయించుకుంటామని కాజల్ వివరించారు.

ఈ డిన్నర్ డేట్ అనేది వినడానికి చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. బంధంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ తమ వృత్తిపరమైన పనుల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. ఫోన్ స్క్రోల్ చేయకుండా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల మనసు విప్పి సంభాషించుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. ఇది దంపతుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని చెప్పారు.
కాజల్ అగర్వాల్ పర్సనల్ లైఫ్
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లులకు 2020లో వివాహం జరగగా.. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో డిన్నర్లు కూడా ఫోన్లు చూసే కార్యక్రమంగా మారిపోతున్న తరుణంలో కాజల్ సూచించిన 'వారానికి ఒకసారి ఫోన్-ఫ్రీ డిన్నర్' అనే నియమం నేటి తరం జంటలకు ఎంతో ఉపయోగపడే ఓ మంచి సందేశంగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications
