ఐఐటీ- బీ ప్రొఫెసర్ పై వేటు: చదివింది ఏలూరు, కాకినాడల్లో

ఐఐటీ- బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే బలవన్మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, నిరసనలకు ఐఐటీ మేనేజ్మెంట్ దిగొచ్చింది. డీన్ ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూళ్లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ వేటు అమలులో ఉంటుంది.

బీటెక్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల సాహిల్ వాకోడే.. గత శుక్రవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మిడ్ సెమిస్టర్ పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్‌ ఉపయోగించి ఛాట్ జీపీటీ ద్వారా పరీక్షా పత్రానికి సంబంధించిన సమాధానాలు వెతకడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు అతనిపై వచ్చాయి. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే సాహిల్ బలవన్మరణానికి పాల్పడటం క్యాంపస్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది.

IIT Bombay Suspends Dean Suryanarayana Doolla After Student Protests Director Denies Resignation Rumours

ఐఐటీ బాంబేలో ఓ విద్యార్థి మృతి తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఈ విషాద ఘటనకు సంబంధించి ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల కారణం అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదానికి ఆయనే కేంద్ర బిందువు అయ్యారు. సాహిల్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామం నేపథ్యంలో.. ఆయనపై వేటు పడింది. దర్యాప్తు ముగిసేంత వరకూ ఆయన సస్పెన్షన్ లో కొనసాగనున్నారు.

విజయవాడ శాప్ ఆఫీస్ వద్ద నిరసనలకు వైసీపీ ప్రయత్నం
విజయవాడ శాప్ ఆఫీస్ వద్ద నిరసనలకు వైసీపీ ప్రయత్నం

ఈ వివాదంలో చిక్కుకున్న ప్రొఫెసర్ సూర్యనారాయణకు ఐఐటీ బాంబేలో మంచి అకడమిక్ ట్రాక్ రికార్డు ఉంది. పవర్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానం వంటి సంక్లిష్ట విభాగాల్లో ఆయన నిపుణుడిగా గుర్తింపు పొందారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ- బాంబే నుంచి ఎంటెక్, ఐఐటీ- ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, కాకినాడ జేఎన్టీయూలో చదివారు.

ఈ నెల చివరి వారంలో వరుసగా అయిదు రోజుల మూతపడనున్న బ్యాంకులు: ఎస్బీఐ సూచనలు
ఈ నెల చివరి వారంలో వరుసగా అయిదు రోజుల మూతపడనున్న బ్యాంకులు: ఎస్బీఐ సూచనలు

ఐఐటీ బాంబేలో చేరడానికి ముందు బెంగళూరులోని పవర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్స్ సంస్థతో పాటు హైదరాబాద్‌లో కూడా పనిచేశారు. టీచింగ్ రంగంలో ఆయనకు మంచి పేరుంది. విద్యాబోధనలో చూపిన ప్రతిభకు గాను ఆయనకు 2017లో ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అవార్డు, 2021లో ప్రొఫెసర్ ఎస్ పీ సుఖత్మే ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అవార్డు లభించాయి. బోధనకే పరిమితం కాకుండా ఐఐటీ- బీ లో హాస్టల్ వార్డెన్‌, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ బాధ్యతలను కూడా నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+