జగన్ కు కపిల్ సాహు కీలక రిపోర్ట్ - వీరికి సీట్లు ఇవ్వద్దు, అయిదు జిల్లాల్లో కీలక మార్పులు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి - వైసీపీ స్థానిక ఎన్నికల కోసం సిద్దం అవుతూనే 2029 కోసం సమాయత్తం అవుతున్నాయి. ఇదే సమయంలో రెండు వైపు లా సర్వే నివేదికలు కీలకంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీలో సీట్ల ఖరారు మొదలైన వేళ తమిళనాడులో సీఎం విజయ్ గెలుపు వెనుక కీలకంగా పని చేసిన కపిల్ సాహు ఏపీలో జగన్ పార్టీ కోసం సర్వే చేయించారు. అయిదు జిల్లాలకు సంబంధించి సమర్పించిన నివేదిక కీలక అంశాల ను సూచించినట్లు సమాచారం.

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ తన పాద యాత్ర ద్వారా మరోసారి అధికారానికి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయం లో నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ ల మార్పు.. సామాజిక సమీకరణాలతో పాటుగా టీడీపీ కంచుకోటల పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.

రాజీ బాటలో జగన్ - షర్మిల..! 'లెక్కలు' సెటిల్ - తేలాల్సింది ఆ ఒక్కటే..!?
రాజీ బాటలో జగన్ - షర్మిల..! 'లెక్కలు' సెటిల్ - తేలాల్సింది ఆ ఒక్కటే..!?
Kapil Sahu Submits Ground Report to YS Jagan Offers Suggestions on Seat Finalisation as reports

ఇందు కోసం చేస్తున్న తమిళనాడులో విజయ్ గెలుపు వెనుక కీలకంగా పని చేసిన వ్యూహకర్త కపిల్ సాహు టీం క్షేత్ర స్థాయి నివేదికలు సిద్దం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే అయిదు జిల్లాల గ్రౌండ్ రిపోర్ట్ సమర్పించారని .. అందులో ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ల పని తీరు.. భవిష్యత్ సీట్ల కేటాయింపు.. పబ్లిక్ మూడ్.. తిరిగి ప్రజల్లో పట్టు కోసం తీసుకోవాల్సిన చర్యల పైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా.. రాయలసీమ లోని రెండు జిల్లాలో పాటుగా ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలకు సంబంధించి ఈ నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. అందులో 2029 ఎన్నికల్లో ముఖ్య నేతల వారుసులకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్లనే బరిలోకి దింపాలని.. గతంలో అభ్యర్ధులను నియోజకవర్గాలకు చేసిన మార్పులను రద్దు చేసి సొంత నియోజకవర్గాలకు పంపాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

 లిక్కర్ కేసులో జగన్ కేంద్రంగా, కీలక పరిణామాలు: అప్రూవర్ రెడీ.. తెర వెనుక..!!
లిక్కర్ కేసులో జగన్ కేంద్రంగా, కీలక పరిణామాలు: అప్రూవర్ రెడీ.. తెర వెనుక..!!

తాజా నివేదికలో భాగంగానే మచిలీపట్నం, చీపురుపల్లి, గుడివాడ, గన్నవరం, ఆముదాల వలస, శ్రీకాకుళం వంటి నియోజకవర్గాల్లో సీనియర్లనే బరిలోకి దించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో కీలక మార్పుల పైన సూచనలు అందించారని తెలుస్తోంది. ఈ సూచనల మేరకే బొత్సా, కొడాలి నాని, పేర్ని నాని, తమ్మినేని వంటి వారికి వచ్చే ఎన్నికల్లో వారే పోటీలో నిలిచేలా జగన్ స్పష్టత ఇచ్చారని సమాచారం. మరి కొందరు నేతలతోనే జగన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా గతంలో మార్పు చేసిన నియోజకవర్గాల నుంచి నేతలను తిరిగి తమ సొంత నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+