సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు: మహిళా పారిశ్రామికవేత్త షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్‌లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతున్న శోభా రెడ్డి అనే మహిళా పారిశ్రామికవేత్త తనకు జరిగిన వేధింపులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరుతూ ఓ సోషల్ మీడియా వీడియోను విడుదల చేశారు. అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో చట్టబద్ధమైన అవకాశాల కోసం గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నానని.. అయితే తనకు ఎదురైన అనుభవాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని శోభారెడ్డి పేర్కొన్నారు.

టీజీ ఈ-టికెట్‌ యాప్‌... తెలంగాణాలో వాహన దొంగలకు ఇక చుక్కలే!
టీజీ ఈ-టికెట్‌ యాప్‌... తెలంగాణాలో వాహన దొంగలకు ఇక చుక్కలే!

'గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు'
ఔట్ డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో గత మూడేళ్లుగా తాను చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నానని.. ఈ క్రమంలో ప్రభుత్వ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లే ప్రయత్నంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తిని సంప్రదించినట్లు శోభా రెడ్డి వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి తన సమస్యను పరిష్కరించేందుకు నేరుగా గెస్ట్‌హౌస్‌కు రావాలని అడిగారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం తనకు ఇష్టం లేదని.. సదరు వ్యక్తి పేరను బహిరంగంగా వెల్లడించబోనని చెప్తూనే.. మహిళా పారిశ్రామికవేత్తలకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Woman Entrepreneur Shobha Reddy Alleges CM Revanth Reddy Aide Asked Her to Visit Guesthouse BRS demands an inquiry

రాజకీయ రంగు పులమవద్దని విజ్ఞప్తి
తాను ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు ఆశించడం లేదని, కేవలం చట్టబద్ధమైన అవకాశం, సమానత్వం, ఆత్మగౌరవం మాత్రమే కోరుకుంటున్నానని శోభారెడ్డి స్పష్టం చేశారు. తన ఫిర్యాదును ఏ రాజకీయ పార్టీకి ముడిపెట్టవద్దని, ఊహాగానాల ఆధారంగా పేర్లను వెైరల్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించినప్పుడు ఇది మున్సిపల్ శాఖ చూసే ముఖ్యమంత్రితో ముడిపడి ఉన్న అంశమని చెప్పడంతోనే తాను వారిని సంప్రగించాల్సి వచ్చిందని వివరించారు.

ఈ నెల 27 వరకు తెలంగాణలో వానలే వానలు.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు..
ఈ నెల 27 వరకు తెలంగాణలో వానలే వానలు.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు..

తాను చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చానని.. ముగ్గురు పిల్లల బాధ్యత తనపై ఉందని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేయవద్దని వేడుకున్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లకు ఆమె తన పోస్టును ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఈ వీడియో, పోస్ట్ వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా దీనిపై ఆరా తీయడం ప్రారంభించాయి.

బీఆర్ఎస్ విమర్శలు
మహిళా పారిశ్రామికవేత్త శోభారెడ్డి ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎల్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఓ మహిళా పారిశ్రామికవేత్త చట్టబద్ధమైన అవకాశం కోసం ఇన్ని ఇబ్బందులు పడటం దారుణమని విమర్శించారు. బాధితురాలికి మద్ధతుగా మహిళా నాయకులు మాట్లాడాలని సూచించారు. సదరు గెస్ట్‌హౌస్ ఎవరిది? ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అనుచరుడు ఎవరు? అనే అంశాలపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సర్కారు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+