ఈ వారం ఓటీటీల్లో దుమ్ము రేపే సినిమాలు ఇవే

చూడటానికి చాలా సినిమాలు, ఓటీటీలో మాత్రం ఏది చూడాలో అర్థం కావడం లేదా? అయితే మీ వీకెండ్ బోరింగ్‌ను దూరం చేయడానికి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. రొమాంటిక్ లవ్ స్టోరీలు, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలతో ఈ వారం ఓటీటీ అలరించడానికి వచ్చేసింది. అవేంటో ఒకసారి చూసేద్దాం రండి!

నెట్‌ఫ్లిక్స్ స్పెషల్స్

లస్ట్ స్టోరీస్ 3 (సెప్టెంబర్ 18): ఆధునిక సంబంధాలు, ప్రేమ, సాన్నిహిత్య భావాల నేపథ్యంలో సాగే ఈ ఆంథాలజీ మూడో భాగం ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నలుగురు దర్శకులు తెరకెక్కించిన ఈ హిందీ చిత్రం మీ వాచ్‌లిస్ట్‌లో ఉండాల్సిందే.

OTT These Movies Are Set to Entertain Audiences This Week

ఇరుముడి (సెప్టెంబర్ 18):

రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కుటుంబ కథా చిత్రం ఇది. అయ్యప్ప భక్తి నేపథ్యంలో సాగే తండ్రీ కూతుళ్ల భావోద్వేగ సంఘర్షణ ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయం.

ది స్కాండల్ (సెప్టెంబర్ 18): కొరియన్ చారిత్రక ప్రేమకథ ఇది. ఫ్రెంచ్ నవల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో, ఒక ఉన్నత వర్గ మహిళ నడిపించే ప్రమాదకరమైన సమ్మోహన ఆట ఆసక్తికరంగా ఉంటుంది.

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (సెప్టెంబర్ 18): మైత్రేయి రామకృష్ణన్ నటించిన ఈ ఇంగ్లీష్ యూత్ సినిమా, నృత్య పోటీల నేపథ్యంలో స్నేహం, కలల సాధన చుట్టూ తిరుగుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో & సోనీలివ్

కట్టాలన్ (సెప్టెంబర్ 18): 1995 నాటి కేరళ-తమిళనాడు సరిహద్దుల నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ మలయాళ థ్రిల్లర్ ఇది. అక్రమ దంతాల స్మగ్లింగ్, నేర సామ్రాజ్య నేపథ్యంలో సాగే పోరాటం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

తుడక్కం (సెప్టెంబర్ 18): మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ నటిగా పరిచయమవుతున్న మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

హుంకార్ - ది రోర్ (సెప్టెంబర్ 25): ఒక ఆధ్యాత్మిక గురువుపై వచ్చే ఆరోపణలు, నేరం, న్యాయస్థానం నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది.

జీ5

అగాధ (సెప్టెంబర్ 25): ఆధ్యాత్మిక శక్తులున్న మహాదేవి అనే మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నిషేధిత గుహలోకి వెళ్లి, ఒక భయంకరమైన చీకటి శక్తితో చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+