భారత్ పై అమెరికా 100 శాతం టారిఫ్‌ లు..? పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు..!

భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రక్షణ రంగంతోపాటు అనేక రంగాల్లో భారత్ కు రష్యా అండగా ఉంటూ వస్తోంది. ఇక భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రష్యా, యూఏఈ నుంచి భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు రష్యా తక్కువ ధరకే భారత్ కు చమురును విక్రయిస్తోంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 50 శాతానికిపైగా రష్యా నుంచే వస్తోంది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా టారిఫ్ లను విధిస్తున్న సంగతి తెలిసిందే.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 100 శాతం టారిఫ్ లు విధిస్తామంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలో భారత్ పైనా 100 శాతం టారిఫ్ లు తప్పవని సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్- భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వెరీ గుడ్ వర్కింగ్ రిలేషన్ షిప్ ఉందని తెలిపారు. ఈ సమస్యను వారు చర్చలతో పరిష్కరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వెరీ గుడ్ వర్కింగ్ రిలేషన్ షిప్ ఉంది. టారిఫ్ సమస్యను ఇరు దేశాధినేతలే పరిష్కరించుకుంటారు. భారత్- రష్యా మధ్య గతంలో చమురు ట్రేడ్ లేదు. కానీ రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య చమురు వాణిజ్యం గణనీయంగా పెరుగుతూ వచ్చింది" అని పీటర్ నవారో స్పష్టం చేశారు.

UStariffs on India 100 Russian Crude Imports Peter Navarro makes key remarks regarding the issue

ఇదిలాఉంటే అమెరికా నుంచి వస్తున్న ఆంక్షల ఒత్తిళ్లను ఏమాత్రం లెక్కచేయకుండా భారత్.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఒక్క జూలై నెలలోనే భారత్ దాదాపు రూ. 60 వేల కోట్లకుపైగా రష్యన్ క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకుముందు జూన్ నెలతో పోల్చితే ఈ దిగుమతులు ఏకంగా 2.1 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత తదితర కారణాలతో జూలై నెలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+